విజ్ఞాన్స్‌లో యువ కార్నివాల్
సాంకేతికత శరవేగంగా విస్తరిస్తున్న నేటి డిజిటల్ యుగంలో విద్యార్థులు తమ మానసిక సమతుల్యతను కాపాడుకోవడం ఎంతో కీలకమని ప్రముఖ సైకాలజిస్ట్, మెంటల్ హెల్త్ అడ్వకేట్ రాజేశ్వరి జాస్తి అన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు, వారిని ఒత్తిడి నుంచి దూరం చేసి మానసిక ఉల్లాసాన్ని ఇచ్చేందుకు ‘యువ కార్నివాల్- వంటి వేదికలు ఎంతో దోహదపడతాయని ఆమె పేర్కొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా, భూదాన్ పోచంపల్లి మండలం, దేశ్ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో శనివారం ‘యువ కార్నివాల్-2026’ వేడుకలు వైభవంగా జరిగాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్ సంయుక్త ఆధ్వర్యంలో ‘ది ఫ్లూయిడిటీ ఆఫ్ లైఫ్‘ థీమ్తో ఈ వేడుకలను నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన రాజేశ్వరి జాస్తి ‘డిజిటల్ యుగంలో మానసిక ఆరోగ్యం: సైకాలజిస్టుల పాత్ర మరియు సామాజిక ప్రవర్తన పై ఏఐ’ అనే అంశంపై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఏఐ, నిరంతర స్క్రీన్ సమ యం మానవ ప్రవర్తనను ఎలా ప్రభావితం చేస్తున్నాయో వివరిస్తూ, సాంకేతికతకు బానిసలు కాకుండా స్వీయ నియంత్రణతో మాన సిక ఆరోగ్యాన్ని ఎలా పెంపొందించుకోవాలో విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.
కార్నివాల్ లో భాగంగా విద్యార్థుల మానసిక భావోద్వేగాలను, సృజనాత్మకతను ప్రతిబింబించేలా ఫ్యా న్సీ డ్రెస్, పోస్టర్ మేకింగ్ (ఎమోషన్స్ వ్యక్తీకరణ), ఫోటోగ్రఫీ, ఆర్ట్ ఫ్రమ్ స్క్రాచ్, పోయెట్రీ (కవిత్వం), మరియు మెమొరీ క్వెస్ట్ వంటి వినూత్న పోటీలను నిర్వహించారు. వీటిలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. విద్యార్థులు స్వయంగా ఏర్పా టు చేసిన ఫుడ్ కోర్టులు, వివిధ రకాల స్టాల్స్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
కార్నివాల్ ముగింపు సందర్భంగా నిర్వహించిన‘పాఠశాల’ సెషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు నగదు పురస్కారాలతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. పాల్గొన్న విద్యార్థులందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో విజ్ఞా న్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరరావు, ఆయా విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.






