9 August, 2026 | 2:48 PM

రెంజల్‌లో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

09-08-2026 01:29 PM

బోధన్ ఆగస్టు 09 (విజయక్రాంతి): రెంజల్‌ మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇందిరా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై యూత్ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బోధన్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కార్తీక్ యాదవ్, ఏఎంసీ డైరెక్టర్ కుర్మా శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రవి, నిజామాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అబ్బోల్ల శ్రీకాంత్, రెంజల్ మండల అధ్యక్షులు గైని కిరణ్, రెంజల్ గ్రామ అధ్యక్షులు దగ్గుల శ్రీకాంత్, బోర్గం గ్రామ అధ్యక్షులు రమేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు గైని శివ, భార్గవ్ రెడ్డి, రజాక్ తదితరులు పాల్గొన్నారు.