16 August, 2026 | 11:01 AM

మానవత్వం చాటుకున్న యువత

16-08-2026 09:10 AM

అంత్యక్రియలకు రూ.10,100 ఆర్థిక సాయం

మహమ్మదాబాద్ : మండల పరిధిలోని జూలపల్లి గ్రామానికి చెందిన ముక్కు చెన్నమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న చైతన్య యువజన సంఘం సభ్యులు మానవతా దృక్పథంతో మృతిరాలి  అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం భర్త ముక్కు అంజిలయ్యకు రూ.10,100 ఆర్థిక సాయం అందజేశారు. మృతురాలికి ప్రశాంతి, ప్రవల్లిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అంత్యక్రియల్లో చైతన్య యువజన సంఘం సభ్యులతో పాటు కాలనీవాసులు మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.