17 April, 2026 | 3:14 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

తైక్వాండో క్రీడాకారులకు కలర్ బెల్టుల ప్రధానం

09-11-2025 06:21 PM

చిట్యాల (విజయక్రాంతి): తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో తైక్వాండో కలర్ బెల్ట్ పోటీలను చిట్యాల ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం నిర్వహించారు. ఈ యొక్క పోటీలకు చిట్యాల, రామన్నపేట, నార్కట్ పల్లి మూడు మండలాల నుండి 40 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నలగొండ జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి(డివైఎస్ఓ) మహమ్మద్ అక్బర్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. వారు మాట్లాడుతూ తెలంగాణ గవర్నమెంట్ క్రీడా శాఖకు పెద్దపీట వేశారు అని, ఇక్కడ ఉన్న క్రీడాకారులందరూ ఈ యొక్క టైక్వాండో క్రీడలొ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని కోరారు.

ఈ యొక్క సర్టిఫికెట్ 2% స్పోర్ట్స్ కోటలొ వస్తుందని, ఈ సర్టిఫికెట్ను ఉపయోగించుకొని స్పోర్ట్స్ కోటాలో ఉన్నత చదువులకు గవర్నమెంట్ ఉద్యోగాలకు రిజర్వేషన్ ఉంటుందని, స్పోర్ట్స్ కు సంబంధించి మీకు ఎలాంటి సహాయం కావాలన్నా ఆయనను సంప్రదిస్తే, అతను చేసి పెడతానని, క్రీడాకారుల  తల్లిదండ్రులకు  సూచించారు. ప్రతి ఒక్కరూ రెగ్యులర్ గా క్రీడాకారులని గ్రౌండ్ కు పంపించాలని, వీళ్లే రేపటి పౌరులు అని అన్నారు. అనంతరం బెల్టులు సాధించిన క్రీడాకారులకు బెల్టు ప్రధానం చేశారు.10 ఎల్లో 05 ఎల్లో వన్ 09 గ్రీన్ 06 గ్రీన్ వన్ 04 బ్లూ 02 బ్లూ వన్ 02 రెడ్ బెల్టులను సాధించారు. ఈ యొక్క కార్యక్రమంలో మాస్టర్ సుధాకర్, కోచ్ పి. పనింద్ర కుమార్, డి వైష్ణవి రెడ్డి పాల్గొన్నారు.