27 June, 2026 | 3:35 AM

డ్రగ్స్ రహిత సమాజానికి యువత ముందుకు రావాలి

27-06-2026 02:07 AM

వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ పిలుపు

హనుమకొండ, జూన్ 26 (విజయక్రాంతి): డ్రగ్స్ రహిత సమాజం నిర్మాణం కోసం యువత ముందుకు రావాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. ప్రపంచ మాదకద్రవ్యాల దుర్వినియోగం, ఆక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకోని సెంట్రల్ జోన్ పోలీసుల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2కె పరుగును వరంగల్ పోలీస్ కమిషనర్ ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, కుడా చైర్మన్తో కలసి ప్రారంభించారు.

ట్రై సిటి పరిధిలోని యువత విద్యార్థులు పాల్గోన్న ఈ పరుగు వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయము నుండి సుబేదారిలోని ఆరట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం వరకు కోనసాగింది. ఈ పరుగులో ప్రతిభ కబరిచిన యువతకు ముఖ్య అతిధిల చేతుల మీదుగా పతకాలు, సర్టిఫికేట్లను అందజేశారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ యువత చేడు వ్యసనాలను దూరంగా వుంటూ ఆరోగ్యంతో వుండాలని, మత్తు పదార్థాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగివుండటంతో పాటు, ఇతరులకు అవగాహన కల్పించాలని తెలిపారు.

మత్తు పదార్థాల నియంత్రణకై ఈగల్ ఫోర్స్ విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ ఎవరైన మాదకద్రవ్యాలు విక్రయించిన, వినియోగించిన తక్షణమే 1908 నంబర్కు సమాచారం అందించాలని అన్నారు. హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి మాట్లాడుతూ ఉజ్వల భవిష్యత్త్ వున్న యువత మత్తుకు దూరంగా వుండాలని, డ్రగ్స్కు బానిసలైన వారి కుటుంబాలు, ముఖ్యంగా తల్లులు అనుభవించే వేదన వర్ణనాతీతమని ఆవేదన వ్యక్తం చేసారు.

ఈ కార్యక్రమములో టిజీ ఎన్పిడిసిఎల్ సీయం.డి వరుణ్ రెడ్డి, వరంగల్ కలెక్టర్ డా.సత్యశారద, కుడా చైర్మన్ ఇనుగాల వెంట్రామిరెడ్డి, డిసిపిలు దార కవిత, అంకిత్కుమార్, అడిషినల్ కలెక్టర్ సంధ్య, అడిషినల్ డిసిపిలు,ఎసిపిలు, ఇన్స్సె్పక్టర్లు,ఆర్.ఐలు, ఎస్.ఐలు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గోన్నారు.