విపత్తుల సమయంలో యువత ముందుండాలి
రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
ఓయూలో యువ ఆపద మిత్ర శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభం
పాల్గొన్న ఓయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం
హాజరైన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రెవెన్యూ విభాగం ఎం.దాన కిషోర్
సికింద్రాబాద్, మార్చి 7 (విజయక్రాంతి): విపత్తులను సమయంలో యువత ముం దుండి సహాయ సహాకారాలు అందించాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చా రు. సంక్షోభ సమయంలో సేవ చేసేందుకు యువత సిద్ధంగా ఉండటం ఒక దేశానికి నిజమైన బలమన్న గవర్నర్ జాతీయ సేవా పథకం వాలంటీర్లను ఆపద మిత్రులుగా తీర్చిదిద్దడం ద్వారా, ప్రాణాలను రక్షించగల శక్తి, విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు సత్వారమే స్పందించే బలమైన వ్యవ స్థను గ్రామస్థాయి వరకు నిర్మిస్తున్నామని గవర్నర్ పేర్కొన్నారు.
ఓయూలోని ఠాగోర్ ఆడిటోరియంలో తెలంగాణ ప్రభుత్వ యువఆపద మిత్ర పథకం కింద, రీజినల్ సెంటర్ ఫర్ అర్బన్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ సంస్థ రాష్ట్ర రెవెన్యూ విభాగంతో కలిసి నిర్వహిస్తున్న యువ ఆపద మిత్ర వాలంటీర్ల శిక్షణ కార్యక్రమానికి ఉస్మానియా విశ్వ విద్యాలయ చాన్సలర్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ ఆపదమిత్ర కార్యక్రమాన్ని సమర్థ వంతంగా అమలు చేస్తూ యువ తను సమా జ సేవకు సిద్ధం చేస్తున్నందుకు ఉస్మానియా విశ్వ విద్యాలయాన్ని అభినందించారు. దేశ నిర్మాణంలో యువత విద్యార్థుల కళ్లలో కనిపించే ఉత్సాహం, వారి హృదయా ల్లో ఉన్న ఆశ దేశానికి నిజమైన బలం అని అన్నారు.
ఈ కార్యక్రమానికి హాజరైన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రెవెన్యూ విభాగం ఎం. దాన కిషోర్ మాట్లాడుతూ రాష్ట్ర విపత్తు నిర్వహణ వ్యవస్థలో యువ వలంటీర్ల పాత్ర అత్యంత కీలక మని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేష్ రెడ్డి, అర్బ న్ స్టడీస్ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీనగేశ్, ప్రొఫెసర్ చలమల్ల వెంకటేశ్వర్లు, సైన్స్ విభాగ డీన్, వైస్ చాన్సలర్కు ప్రత్యేక అధికారిగా ఉన్న ప్రొఫెసర్ ఎస్.జితేందర్ కుమార్ నాయక్ తదిత రులు పాల్గొన్నారు.




