8 March, 2026 | 1:47 AM

తెలంగాణ టీ చాంపియన్ షిప్

08-03-2026 12:16 AM

లక్ష గెలుచుకున్న నారాయణగూడకు చెందిన రచన దుగ్గడ్ 

250కి పైగా సరికొత్త టీ రుచులతో ప్రదర్శన

హైదరాబాద్, మార్చి ౭(విజయక్రాంతి)-: అల్లం చాయ్, బెల్లం చాయ్, పుదీనా చాయ్, యాలకుల చాయ్, లెమన్ గ్రాస్ చాయ్, బీట్ రూట్ చాయ్ ఇలా చెప్పుకుంటూ పోతే రెండు వందలకు పైగా సరికొత్త టీ రుచులను పరిచయం చేసింది హైబిజ్ టీవీ తెలంగాణ టీ ఛాంపియన్ షిప్ 2026. సాంప్రదాయ రుచులతో పాటు వినూత్నమైన ఫ్లేవర్లను అందించింది. ఈ టీ కాంపిటీషన్‌లో మహిళలు తమ సృజనాత్మకతను అద్భుతంగా ప్రదర్శించారు.

ఎంతో ఉత్సాహంగా పాల్గొని రకరకాల చాయ్ రుచులను పరిచయం చేశారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి గృహిణులు, ఉద్యోగినులు, యువ పారిశ్రామికవేత్తలు, ఇతర రంగాల అతివలు తెలంగాణ టీ ఛాంపియన్ షిప్‌లో పాల్గొన్నారు.ప్రపంచంలోనే మహిళల కోసం నిర్వహించే ఏకైక టీ ఛాంపియన్ షిప్ గా ఈ పోటీ గుర్తింపు పొందింది. హైదరాబాద్ హెచ్‌ఐసీసీ నోవాటెల్ లో జరిగిన కార్యక్రమానికి 250 మందికి పైగా అతివలు హాజరయ్యారు. వారు తయారు చేసిన ప్రత్యేకమైన టీ రుచులు సందర్శకుల నోరూరించాయి.ఈ కార్యక్రమానికి టీ బోర్డ్ అఫ్ ఇండియాతో పాటు తెలంగాణ టూరిజం శాఖ  సహకారాన్ని అందించాయి.

ప్రజల్లో టీపై అవగాహన పెంచడం, చాయ్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలియజేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, టీ బోర్డ్ అఫ్ ఇండియా కూనార్ జోనల్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ భరణి కుమార్ ఐఏఎస్, కావ్య కిషన్ రెడ్డి, మిస్ యూనివర్స్ తెలంగాణ 2025 విజేత మిస్ కాశ్వీలు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమం ఏ-వన్ టీ కంపెనీ (టీ భాగస్వామి), సుభాన్ బేకారి (బేకింగ్ భాగస్వామి), స్వస్తిక్ స్పుసైస్ అండ్ త్రి మాంగో (మసాలా భాగస్వాములు), మానేపల్లి జెవెల్లెర్స్ (ఆభరణాల భాగస్వామి), ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ హైదరాబాద్ (ఆతిథ్య భాగస్వామి)సహకారంతో నిర్వహించబడింది.

21 వనమూలికలతో ఛాయ్ తయారు చే సి నారాయణగూడకు చెందిన రచన  మొద టి బహుమతి రూ.లక్ష, మల్లంపేటకు చెందిన ఉషారాణి మసాలా ఛాయ్ తయారు చేసి రెండో బహుమతి రూ.50వేలు, కొండాపూర్‌కు చెందిన ప్రియాంక పుదీనా, లెమన్ గ్రా స్, అల్లం మిక్స్ మసాలా ఛాయ్ తయారు చేసి మూడో బహుమతి రూ.25వేలు గెల్చుకున్నారు. 50మందికి పైగా ప్రోత్సాహక బ హుమతులు అందజేయబడ్డాయి. 250 మందికి పైగా మహిళలు ఒకేచోట టీ తయా రు చేయడం చాలా ఆనందంగా ఉందని హైబిజ్ వన్ ఫౌండర్ అండ్ ఎండీ, నిర్వాహకులు డా. జె సంధ్య రాణి తెలిపారు.