26 June, 2026 | 1:47 AM

ఆన్‌లైన్ యాప్‌లు, గంజాయి, సైబర్ నేరాలకు యువత దూరంగా ఉండాలి

26-06-2026 12:00 AM

ఓ ఆర్ ఆర్‌పై అతివవేగం పనికిరాదు: నార్సింగి సీఐ హరికృష్ణ రెడ్డి

రాజేంద్రనగర్ జూన్ 25 (విజయక్రాంతి): యువత ఆన్‌లైన్ లోన్లు గంజాయి సైబర్ నేరాలకు దూరంగా ఉండాలని  నార్సింగి సి ఐ హరికృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆయన ‘విజయ క్రాంతి‘ తో మాట్లాడారు. సోషల్ మీడియాలో వచ్చే ఆన్ లైన్ యాప్ ల లింకులను ఓపెన్ చేయడంవల్ల బ్యాంకు ఖాతాలో దాచుకున్న నగదును కీటుగాళ్లు కొట్టేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.  ఆన్ లైన్ మోసాల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని  1930 టోల్ ఫ్రీ నెంబరు ను  సంప్రదించాలని సూచించారు.

అలాగే ఓ ఆర్ ఆర్ పై మితిమీరిన వేగంతో వాహనాలను నడపడం వల్ల వారు ప్రమాదానికి గురి కావడం మె కాక  ఎదుటివారి ప్రాణాలను తీస్తున్నారని ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ ధరించాలని  పరిమితికి మించిన వేగంతో  ఓ ఆర్ ఆర్ పై వాహనాలు నడిపిన. తల్లిదండ్రులు. మైనర్లకు వాహనాలు ఇచ్చిన చర్యలు తప్పవు అన్నారు.. 

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే తాట తీస్తామన్నారు సైబరాబాద్ కమిషనర్ ఆదేశాల మేరకు త్వరలోనే  ఆన్లైన్ మోసాలు ట్రాఫిక్ నిబంధనలు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని మత్తు పదార్థాల వినియోగం. సరఫరా. సైబర్ మోసాలకు పాల్పడే వారి సమాచారాన్ని పోలీసులకు అందజేయాలని సీఐ హరికృష్ణ రెడ్డి తెలిపారు .