26 June, 2026 | 1:48 AM

వరుణుడి కోసం బొడ్రాయికి జలాభిషేకం

26-06-2026 12:00 AM

కేసముద్రం, విజయక్రాంతి: వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ.. వరుణ దేవుడి కరుణ కోసం కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని కేసముద్రం (వి)లో మహిళలు వరుణ జపం నిర్వహించి బొడ్రాయికి జలాభిషేకం చేశారు. వర్షాకాలంలో వర్షాలు కురవాల్సిన కార్తెలన్ని ఒక్కొక్కటిగా గడుస్తున్న వరుణుడి జాడ లేకపోవడంతో వ్యవసాయంపై ఆధారపడ్డ కుటుంబాలు వాన దేవుడి కృప కోసం వేడుకున్నారు.