మెగా జాబ్ మేళ యువత సద్వినియోగం చేసుకోవాలి
250 కంపెనీలు.. అర్హత ఉన్న యువత సద్వినియోగం చేసుకోవాలి
యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు కొరికొప్పుల నరేష్ గౌడ్
తుంగతుర్తి,(విజయక్రాంతి): నిరుద్యోగ యువత(Unemployed youth)కు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈ నెల 19న కోదాడ పట్టణంలోని సీసీ రెడ్డి స్కూల్‌లో మెగా జాబ్‌మేళా(Mega Job Fair) నిర్వహించనున్నట్లు యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు కొరికొప్పుల నరేష్ గౌడ్ తెలిపారు. జిల్లా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) ఆధ్వర్యంలో సుమారు 200 నుంచి 250 కంపెనీలు జాబ్‌మేళాకు హాజరై ,అర్హులైన అభ్యర్థులను వివిధ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు చెప్పారు.
ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, డిగ్రీ, ఐటీఐతో పాటు ఆయా ఉద్యోగాలకు అవసరమైన విద్యార్హతలు ఉన్న నిరుద్యోగ యువత జాబ్‌మేళాకు నేరుగా హాజరై ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చన్నారు. పెద్ద సంఖ్యలో కంపెనీలు ఒకే వేదికపై అందుబాటులో ఉండటంతో యువతకు ఉద్యోగం పొందే ,మంచి అవకాశం లభించనుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు కొండంత అండగా ఉన్నట్లు, తుంగతుర్తి నియోజకవర్గ పరంగా అర్హత ఉన్న ప్రతి ఒక్క యువత, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆయన కోరారు.