31 July, 2026 | 1:47 AM

రోడ్ల దుస్థితిపై యువకుల వినూత్న నిరసన

31-07-2026 12:24 AM

సిర్గాపూర్, జూలై 30: సిర్గాపూర్ మండల కేంద్రంలో రోడ్ల దుస్థితిపై యువకులు వినూత్నంగా నిరసన తెలిపారు. మండల కేంద్రంలో రోడ్లపై గుంతలు ఏర్పడి బురదగా మారి ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు నుంచి ఎలాంటి స్పందన లేకుండా పోయింది.

మొత్తం రోడ్డు అధ్వాన్నంగా మారి మడిగా మారడంతో వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేస్తున్నామని యువకులు తెలిపారు. వాహనాలకు రాక పోకలకు చాలా ఇబ్బందికరంగా ఉందన్నారు. ఖేడ్ నుండి సిర్గాపూర్ మీదుగా మాసన్ పల్లి వరకు రోడ్డు మంజూరై రెండేళ్ళు గడుస్తున్నా ఇంతవరకు నిర్మాణ పనులు జరగడం లేదని మండిపడ్డారు. ఖేడ్ వెళ్లాలంటే చుట్టూ ప్రక్కల గ్రామాల నుండి రోజు కొన్ని వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటారని ఇప్పటి కైనా అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణ పనులు మొదలు పెట్టాలని కోరారు.