31 July, 2026 | 2:48 AM

డీఎంఎస్‌ఎస్‌కు రాజకీయ రంగు పులమొద్దు

31-07-2026 01:46 AM

పసుపులేటి శశాంక్

సికింద్రాబాద్, జూలై 30 (విజయక్రాంతి): దెక్కన్ మానవ సేవా సమితితో తన అనుబంధంపై జరుగుతున్న తప్పుడు, దురుద్దేశపూర్వక ప్రచారాన్ని టీపీసీసీ రాష్ట్ర లీగల్ కోఆర్డినేటర్, ఏఐపీసీ తెలంగాణ ఎంఎస్‌ఎంఈ రాష్ట్రాధ్యక్షుడు పసుపులేటి శశాంక్ తీవ్రంగా ఖండించారు.

సికింద్రాబాద్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన తన రాజకీయ జీవితం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకే అంకితమైందన్నారు. దెక్కన్ మానవ సేవా సమితి రాజకీయాలకు అతీతమైన సేవా సంస్థ అని,దానికి రాజకీయ రంగు పులమవద్దని సూచించారు. డీఎంఎస్‌ఎస్ ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేయకుండా అందరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.