- తండ్రీకూతుళ్ల బంధంపై అశ్లీల వ్యాఖ్యలు చేసిన ఇన్‌ఫ్లుయెన్సర్
- ఫోక్సో కేసు నమోదు
హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): తండ్రీకూతుళ్ల బంధంపై అశ్లీల వ్యాఖ్యలు చేసిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రణీత్ హన్మంతును బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులో తెలంగాణ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్థానిక కోర్టులో హాజరు పరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై ప్రణీత్‌ను హైదరాబాద్‌కు తరలించారు. అతనిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సోషల్ మీడియాలో తండ్రీకూతుళ్ల బంధంపై చర్చ పెట్టిన ప్రణీత్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. సినీ నటుడు సాయిధరమ్‌తేజ్ ఆ వీడియోపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ప్రణీత్‌తో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఆ ముగ్గురుని ముందే అరెస్ట్ చేయగా ప్రణీత్‌ను తాజాగా అదుపులోకి తీసుకున్నారు.