7 August, 2026 | 9:13 PM

దెబ్బతిన్న రోడ్లను తక్షణమే మరమ్మతులు చేపట్టాలి

02-09-2025 10:35 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి  అధికారులను ఆదేశించారు. మంగళవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని సంగోజిపేట గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు ధ్వంసమైన రోడ్లన అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ ప్రజలు ఇబ్బందులు పడకుండా రోడ్ల మరమ్మతు పనులను వేగంగా పూర్తిచేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.

రోడ్ల మరమ్మతులు వేగంగా పూర్తిచేసి గ్రామ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.భారీ వరదల కారణంగా బాన్సువాడ నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయని ముఖ్యంగా రహదారులన్నీ ఛిద్రమయ్యాయన్నారు.ఇప్పటికే వ్యవసాయాధికారుల నష్టపోయిన పంటల వివరాలు సేకరిస్తున్నారనీ త్వరలోనే నివేదికను అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనున్నారని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వరప్రసాద్, ఎంపీడీవో ఆనంద్, పీఆర్ ఏఈ, మాజీ ఎంపీటీసీ జెట్టి హన్మాండ్లు రాసాలం సాయిలు బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.