09-07-2025 12:22:12 AM
మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి తోటకూర వజ్రేష్ యాదవ్
ఘట్ కేసర్, జూలై 8 : ఏప్రభుత్వం ప్రవేశపెట్టలేని సంక్షేమ పథకాలను దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టి ఉమ్మడి రాష్ట్ర ప్రజల మన్నలను పొందారని మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కవాడి మాధవరెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఘట్ కేసర్ మున్సిప ల్ పరిధిలోని అంకుషాపూర్, అవుషాపూర్ లలో జరిగిన వేడుకల్లో పార్టీ ఇంచార్జి వజ్రేష్ యాద వ్, బీబ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొని వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈకార్యక్రమాలలో మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు మామిళ్ళ ముత్యాలుయాదవ్, ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ, కీసరగుట్ట దేవస్థానం డైరెక్టర్లు సగ్గు అనీత, తదితరులు పాల్గొన్నారు.