09-07-2025 12:22:56 AM
హైడ్రా అన్ని రాష్ట్రాలకూ అవసరమంటూ సూచన
హైదరాబాద్, సిటీ బ్యూరో జులై 8 (విజయక్రాంతి): నగరంలో హైడ్రా పనితీరును బెంగళూరు లేక్స్ డిపార్ట్మెంట్ ఇంజినీర్ల బృందం మంగళవారం పరిశీలించింది. చెరువుల పరిరక్షణ,పునరుద్ధరణ, అభివృద్ధిని క్షేత్ర స్థాయిలో వీక్షించింది. పాతబస్తీలో బమృక్నుద్దౌలా చెరువుతో పాటు.. అంబర్పేటలోని బతుకమ్మకుంటను సందర్శించింది.
చెరువుల పునరుద్ధరణ, అభివృద్ధి పనులు చేపట్టక ముందు, తాజా పరిస్థితులను గమనించింది. చెరువుల్లో ఆక్రమణలను తొల గించిన తీరును తెలుసుకుంది. నీటి జాడ లేని చెరువులను అభివృద్ధి చేసిన తీరును అభినందించింది. వరదల నివారణకు చెరువుల ప్రాధాన్యత ఎంతో ఉందని వివరిం చింది. చెరువులను అనుసంధానం చేసే నాలాలను కూడా పరిరక్షించాల్సిన అవసరం ఎంతో ఉందని అభిప్రాయ పడింది. ఇందుకు హైడ్రా చేపట్టిన చర్యలను పరిశీలించింది.
చారిత్రక చెరువులపై ఆసక్తి..
అంబర్పేటలో ముల్లపొదలతో, పిచ్చి మొక్కలతో పూర్తిగా కప్పేసిన చెరువును పునరుద్ధరించిన తీరు ఆసక్తిగా ఉందని ఇంజినీ ర్లు అన్నారు. ఆక్రమణలను తొలగించినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యా యో వాకబు చేశారు. బతుకమ్మ కుంట అని పేరు ఎందుకు వచ్చింది. మరి ఆ చెరువు ఎలా పూడ్చివేశారు ఇలా అనేక విషయాలను తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయిలో చెరు వు పునరుద్ధరణ, అభివృద్ధిని చూసి ము చ్చట పడ్డారు.
పాతబస్తీలోని బమృక్నుద్దౌ లా చెరువు గొప్పతనాన్ని తెలుసుకున్నా రు. వనమూలికల మెక్కలు, చెట్ల కొమ్మలు వేసి న ఈ చెరువు దిగువున ఊట బావి నీటిని నిజాం నవాబులు తాగునీటిగా వినియోగించిన చరిత్రను తెలుసుకుని ముచ్చట పడ్డారు. ఇలాంటి చరిత్ర ఉన్న చెరువులను పునరుద్ధరించిన హైడ్రాకు అభినందనలు తెలిపారు.
హైడ్రా అన్ని రాష్ట్రాలకూ అవసరం...
చెరువుల సందర్శన అనంతరం కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిన చీఫ్ ఇంజినీర్ హరిదాసు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు నిత్య, భూప్ర ద, మహదేవ్లతో పాటు ఆ రాష్ట్ర ప్రతినిధులు హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనా థ్గారితో బేటీ అయ్యారు. హైడ్రా గురించి విన్నాం.. పత్రికల్లో చదివాం.. ఇక్కడ ప్రత్యక్షంగా చూ స్తున్నాం. నగరంలో పూర్తిగా కను మరుగైన, కాలుష్యం భారిన పడిన చెరువులను అభివృద్ధి చేస్తున్న తీరు బాగుంద న్నారు.
చెరువులు, నాలాలు, పార్కుల ఆక్రమణలతోపాటు.. ప్రభుత్వ భూములు, ప్రజావసరా లకు ఉద్దేశించిన స్థలాలను పరిరక్షించడం కత్తిమీద సాములాంటిదని.. అనతి కాలంలోనే చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ అంటే ఏం టో ప్రజలు తెలుసుకునేలా చేశారంటూ ప్రశంసించారు. హైడ్రా వంటి సంస్థ అన్ని రాష్ట్రాల కూ అవసరమన్నారు. బెంగళూరులో చెరువుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.
2006 నుంచి చెరువుల హద్దులను నిర్ధారించి ఫెన్సింగ్ వేయ డం ద్వరా కబ్జా కాకుండా చూస్తున్నామన్నారు. కాలువలు కబ్జాకు గురి అవ్వడంతోనే వరదలు వస్తున్నాయని.. త్వరలోనే ఈ సమస్యకు కర్ణాటక ప్రభుత్వం పరిష్కారం చూపడానికి చర్య లు తీసుకుంటోందన్నారు. బెంగళూరులో చెరువులను హైడ్రా కమిషనర్ సందర్శించినప్పటి చిత్రాలతో కూడిన ఫొటో ఫ్రేంను రంగ నాథ్‌కు ఇంజినీర్ల బృందం అందించారు.
హైదరాబాద్, సిటీ బ్యూరో జులై 8 (విజయ క్రాంతి): వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గారు మంగళవారం పరిశీలించారు. బంజారాహిల్స్ రోడ్డు నంబరు 12 వద్ద చింతలబస్తీ ఆరంభంలో ఉండే కల్వర్టును పరిశీలించారు. ఈ కల్వర్టు 12 మీటర్ల విస్తీర్ణంలో ఉండగా.. చింతలబస్తీ వైపు కబ్జాలను తొలగించిన విషయం విధితమే.
6 మీటర్ల మేర కబ్జాకు గురి అవ్వడంతో కల్వర్టు కింద భారీగా చెత్తపోగై వరద సాగడానికి వీలు లేని పరిస్థితి నెలకొంది. అక్కడ చెత్తను తొలగించడానికి లాంగ్ ఆర్మ్ జేసీబీని వినియోగించిన తీరును పరిశీలించారు. ఇదే మాదిరి నగరంలోని ప్రధాన కల్వర్టుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని సూచించారు. అంతకు ముందు కృష్ణ నగర్లో నాలాల తీరును క్షేత్రస్థాయిలో7 పరిశీలించారు.
వరద ముంచెత్తడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరద నివారణకు ఇటీవల కొత్తగా 3 మీటర్ల వెడల్పుతో నిర్మించిన వరద కాలువ మధ్యలో ఎందుకు ఆగిపోయిందో విచారించారు. కృష్ణానగర్ ప్రధాన దారిని దాటించడానికి ఉన్న అవరోధాలపై వాకబు చేశారు.
పై నుంచి ఎంత వెడల్పుతో వస్తుందో అంతే స్థాయిలో బాక్సు డ్రైన్లను కాని.. పైపులను ఒకటి రెండో రోజుల్లో అమర్చి రాకపోకలను పునరుద్ధరించేలా పనులు చేపట్టాల్సిన ఆవశ్యకతను చర్చించారు. సంబంధిత శాఖలన్నిటితో సమావేశమై దీనిపై చర్చించాలని సూచించారు.