కాళేశ్వరం నిర్మాణంతోనే తెలంగాణకు అప్పులు
ఎమ్మెల్యే మందుల సామేలు
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),సెప్టెంబర్02:తెలంగాణ రాష్ట్రంలో రూ.కోట్లు ఖర్చు చేసి కేసీఆర్ నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు శనేశ్వరంగా మారిందని,పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చి లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ కుటుంబం దోచుకు తిన్నదని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు.
మండల పరిధిలోని పర్సాయిపల్లి స్టేజి సమీపంలోని ఆర్‌ఎస్ ఫంక్షన్ హాల్లో మంగళవారం మండలంలోని పలు గ్రామాలకు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్లపట్టాలు,నూతన రేషన్ కార్డులను అధికారులతో కలిసి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ళు పాలించిన కల్వకుంట్ల కుటుంబం కమిషన్ల కుటుంబంగా మారి రాష్ట్రాన్ని దోచుకుతున్నదని దుయ్యబట్టారు. నేడు ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు సంక్షేమ పథకాలు అంది వారి కష్టాలు తీరుతున్నాయని చెప్పారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని, మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవరావు, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, తిరుమలగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్పోజు చామంతి నరేష్, ఉమ్మడి మండల పీఏసీఎస్ చైర్మన్ కుంట్ల సురేందర్ రెడ్డి,తహాశీల్దార్ శ్రీకాంత్,
ఎంపీడీఓ గోపి, మండల పార్టీ అధ్యక్షుడు మోరపాక సత్యం, శిగ నసీర్ గౌడ్,అనిరెడ్డి రాజేందర్ రెడ్డి,నర్సింగ శ్రీనివాస్ గౌడ్,రాజ్యాంగ పరిరక్షణ సమితి మండల కో-ఆర్డినేటర్ జీడి వీరస్వామి, కాంగ్రెస్ నాయకులు సామా అభిషేక్ రెడ్డి, గుడిపెల్లి మధుకర్ రెడ్డి,బైరబోయిన సైదులు, మహారాజు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






