18 July, 2026 | 12:30 AM

నేడు ‘యువ సంగ్రామ సభ’

18-07-2026 12:00 AM
  1. హాజరు కానున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 
  2. సరూర్‌నగర్ సభను విజయవంతం చేయాలి
  3. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పిలుపు

ఎల్బీనగర్, జూలై 17 : నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమ యంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జూలై 18న ఉదయం  సరూర్నగర్ స్టేడియంలో నిర్వహించనున్న యువ సంగ్రామ సభను విజయవంతం చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం సభా ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సభకు సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎల్బీనగర్ నియోజకవర్గంలోని డివిజన్ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువత, వి ద్యార్థులు, ఉద్యోగార్థులు, ప్రజలు పెద్ద సం ఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. యువతకు ఇచ్చిన ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి వంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెం టనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

యువత భవిష్యత్తు కోసం నిర్వహిస్తున్న ఈ సభకు ప్రతి ఒక్కరూ హాజరై తమ సంఘీభావాన్ని తెలియజేయాలని సుధీర్ రెడ్డి కోరారు. ఈ సభకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజర వుతున్నారని, యువత సమస్యలపై బీఆర్‌ఎస్ పార్టీ కార్యాచరణను సభలో ప్రకటించనున్నట్లు తెలిపారు. సభ ను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సుధీర్ రెడ్డి సూచించారు.

సభకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి..

సరూర్‌నగర్లో శనివారం నిర్వహించనున్న బీఆర్‌ఎస్ యువ సంగ్రామ సదస్సుకు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. సభను శాంతియుతంగా నిర్వహించాలని, రహదారుల దిగ్బంధం, ప్రజలకు ఇబ్బందులు కలిగించడం లేదా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరాదని స్పష్టం చేసింది.

ఇటీవల సదస్సుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో బీఆర్‌ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ సందర్భంగా ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హోంశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది మహేష్ జే కోర్టుకు వివరించారు. వాదనలు విన్న హైకోర్టు, నిర్దేశించిన షరతులను పాటిస్తూ సభ నిర్వహించుకోవచ్చని అనుమతి మంజూరు చేసింది.