26 June, 2026 | 1:48 AM

ఇంటింటి సర్వే తీరును పరిశీలించిన జోనల్ కమిషనర్

26-06-2026 12:00 AM

కూకట్‌పల్లి, జూన్ 25 (విజయక్రాంతి): ఎస్‌ఐఆర్ 2026 ఇంటింటి సర్వే గురువారం ప్రారంభమైన నేపథ్యంలో కూకట్పల్లి జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్ బిఎల్ వోల పనితీరును పరిశీలించారు. కూకట్పల్లి జోన్ పరిది కూకట్పల్లి మున్సిపల్‌లోని వివిధ వార్డులలో బిఎల్‌వోలు చేపడుతున్న ఇంటింటి సర్వేను కూకట్పల్లి డిసి ఆంజనేయులు, అసిస్టెంట్ కమిషనర్ ఉదయ్ కుమార్, బిఎల్‌ఓ సూపర్వైజర్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావుతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన బిఎల్‌ఓలకు పలు సూచనలు చేశారు. ఇం టింటి సర్వే ను కచ్చితంగా నిర్వహించాలని, అర్హులైన అన్ని గృహాలను నిర్ధారించాలని,నిర్నీత సమయంలో ఎస్ ఐ ఆర్ 2026 ప్రక్రియను పూర్తి చేయాలని బిఎల్‌ఓ లకు ఆదేశించారు. ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా సమయపాలన పాటిస్తు ఎస్ ఐ ఆర్ 2026 ప్రక్రియను పూర్తిచేయాలని సూచించారు.