చెరువు అక్రమాలపై ఫిర్యాదు

27-11-2026 | 05:24pm

నిర్మల్ నవంబర్ 27 ( విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని కాసర్‌ (కంచెరోని) చెరువు అక్రమాలపై ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్ ఫిర్యాదు చేశారు.

శుక్రవారం జిల్లా రెవెన్యూ అధికారి రాథోడ్ రమేష్‌ కలిసిచెరువు పరిధిలోని సర్వే నంబర్ 1374లో సుమారు 29 గుంటల శిఖం భూమితో పాటు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో ఆక్రమణలు జరిగాయని, అక్రమ పట్టాలు సృష్టించి నిర్మాణాలు చేపట్టారని ఫిర్యాదుల పేర్కొన్నారు. ఆరోపించారు. సమగ్ర సర్వే నిర్వహించాలని, అక్రమ పట్టాలను రద్దు చేసి నిర్మాణాలను తొలగించాలని కోరారు.

మరిన్ని వార్తలు