కేసీఆర్ దీక్షా దివస్ వేడుకలు
నిర్మల్, నవంబర్ 29 (విజయక్రాంతి): లక్ష్మణచందా మండలం వడ్యాల్ గ్రామంలో ఆదివారం దీక్షా దివస్(Deeksha Diwas) నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చిత్రపటానికి పాలాభిషేకం చేసి, గులాబీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం యువ నేత నల్ల వినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఉద్యమ దీక్షను స్మరించుకుంటూ దీక్షా దివస్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో దీక్షా దివస్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.