వంద పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది

29-11-2026 | 04:44pm

బోథ్. నవంబర్ 29 (  విజయక్రాంతి): మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన 100 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవానికి(Hospital inauguration) సిద్ధంగా ఉందని అయితే డిసెంబర్ ఒకటిన ప్రారంభించ నున్న కార్యక్రమం వాయిదా పడిందని త్వరలోనే ఆసుపత్రి ప్రారంభించి ఈ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు(Medical Services) అందే విధంగా తమ ప్రభుత్వం చూస్తుందని మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ(Market Committee Chairman Mallepula Satyanarayana) పేర్కొన్నారు.

ఆదివారం నిర్మాణం పూర్తయిన ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం త్వరలోనే ఈ ఆస్పత్రి ద్వారా సేవలు ప్రజలకు అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఆసుపత్రిలో అవసరమైన డాక్టర్ నియామకం ప్రక్రియ పూర్తి చేస్తుందన్నారు. ఆసుపత్రి లో సేవలు ప్రారంభమైతే ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు '

మరిన్ని వార్తలు