అందరినీ మంత్ర ముగ్ధులను చేసిన ‘మ్యూజికల్ మిస్టరీ

29-11-2026 | 05:03pm
  1. ఉత్సాహంగా డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ హైస్కూల్
  2. సీజన్-4 అంతర్ బూపాఠశాలల పోటీల
  3. 30 పాఠశాలల నుండి 800 మందికి పైగా విద్యార్థుల ప్రతిభా ప్రదర్శన
  4. డిఆర్ఎస్ ఐఏఎస్ డైరెక్టర్ లు అగర్వాల్,సృష్టి అగర్వాల్

​మేడ్చల్ అర్బన్ నవంబర్ 28(విజయక్రాంతి): విద్యార్థుల్లో(students) దాగి ఉన్న సృజనాత్మకతను కళాత్మక నైపుణ్యాలను వెలికితీసే లక్ష్యంతో గుండ్లపోచంపల్లి(Gundlapochampally) లోని డిఆర్ఎస్ ఇంటర్ నేషనల్ స్కూల్(DRS International School) ఆధ్వర్యంలో నిర్వహించిన సీజన్-4 అంతర్ పాఠశాలల సాంస్కృతిక పోటీలు(Cultural Competitions)-2026’అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. మ్యూజికల్ మిస్టరీ(Musical Mystery) పేరట నిర్వహించిన వేడుకల్లో నగరంలోని సుమారు 30 పాఠశాలల నుండి సుమారు 800 మందికి పైగా విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.​

ఈ సందర్భంగా కళలు,శాస్త్రీయ,పాశ్చాత్య, జానపద నృత్యాలు,బృంద గానం,సంగీతం విభాగాల్లో పోటీలు హోరాహోరీగా కోనసాగాయి.రంగురంగుల వస్త్రధారణ,చక్కటి సమన్వయంతో కూడిన నృత్యరీతుల ద్వారా విద్యార్థిని విద్యార్థులు భారతీయ సంప్రదాయాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు.కళల విభాగంలో విద్యార్థులు వ్యర్థాల నుండి అద్భుతమైన కళాకృతులను తయారు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన డిఆర్ఎస్ ఐఎస్ డైరెక్టర్ లు గర్వ్ అగర్వాల్, సృష్టి అగర్వాల్ లు మాట్లాడుతూ చదువుతో పాటు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని వారు పేర్కొన్నారు.భారతదేశం గొప్ప సాంస్కృతిక వారసత్వం కలిగిన దేశమని ఇటువంటి వేదికలు విద్యార్థులకు జీవితాంతం మధురమైన జ్ఞాపకాలను అందిస్తాయని వారు తెలిపారు.

మ్యూజికల్ మిస్టరీ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థుల ప్రదర్శనలు అందరినీ మంత్ర ముగ్ధులను చేశాయని వారు అభినందించారు.అనంతరం అత్యధిక పాయింట్లు సాధించిన పాఠశాలకు  ఛాంపియన్‌ షిప్ ట్రోఫీ'ని వివిధ విభాగాల్లో విజేతలకు బహుమతులు,ప్రశంసా పత్రాలను డైరెక్టర్ లు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఎస్ ఐఎస్ వైస్ ప్రిన్సిపల్స్ కళ్యాణి.పూజ.సక్సేనా.కో-ఆర్డినేటర్ ఇమ్మానుయేల్.వివిధ పాఠశాలల ప్రిన్సిపాల్స్.ఉపాధ్యాయులు.తల్లి దండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు