ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన ఎమ్మెల్యే
జగిత్యాల, నవంబర్ 29 ( విజయక్రాంతి ): జగిత్యాల రూరల్ మండలం(Jagtial Rural Mandal) చల్గల్ గ్రామానికి చెందిన సింగారపు శ్యామల రాజకుమార్ దంపతుల నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ(Housewarming for an 'Indiramma house) కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్యామల కి చీరను కానుకగా అందజేశారు. అనంతరం చల్గల్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ బీమా పథకంలో(Indiramma Family Insurance Scheme) భాగంగా గ్రామంలోని 2038 కుటుంబాలకు బీమా కల్పించిన సందర్భంగా రూపొందించిన పోస్టర్ను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్ల నిర్మాణంతో పాటు ఆర్థిక భద్రత కల్పించేందుకు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. చల్గల్ గ్రామం లో వందశాతం గీతా కార్మికులకు పెన్షన్లు అందిస్తున్నాం అన్నారు. అర్హులు అందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తాం అని, చేయూత పెన్షన్లు నిరంతర ప్రక్రియ అని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో గుడిసెలో ఉన్న వారికి అత్యంత ప్రాధాన్యత అని అన్నారు. జగిత్యాల నియోజకవర్గానికి 5500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయటం జరిగిందని అన్నారు.
అధికారుల తప్పిదం తో L3లో అర్హుల పేర్లు రావడం తో కొంత ఇబ్బంది ఉండగా వారికి త్వరలో కేటాయిస్తాం అని అన్నారు. గీత, నేత, పైలేరియా, వితంతు, ఒంటరి మహిళల పెన్షన్లు పంపిణీ చేయటం తో ఆర్థిక భరోసా కల్పించడం జరిగిందనీ, ఇందిరమ్మ కుటుంబ బీమా తో కుటుంబానికి కొండంత అండ అని, ముఖ్యమంత్రి కోటి కుటుంబాలకు బీమా కల్పిస్తున్నారని అన్నారు.
రైతులకు రైతు బీమా 5 లక్షలు అమలు చేయగా భూమిలేని బీద మధ్యతరగతి ప్రజల కు ఇందిరమ్మ జీవిత బీమా పథకం గొప్ప నిర్ణయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో డి సి సి అధ్యక్షులు గాజంగి నందయ్య, ఫ్యాక్స్ చైర్మెన్ కొలుగూరి దామోదర్ రావు, ఏ ఎం సీ వైస్ చైర్మన్ అబ్బూరి మల్లేశం గౌడ్, గడ్డం గంగారెడ్డి, పులిశెట్టి శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ తిరుపతి, నలువల సురేష్, దాసరి సతీష్, వివిధ సంఘ కుల పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.