నిజామాబాద్‌లో ప్రశాంతంగా ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్ష

29-11-2026 | 04:54pm

6,258 మంది అభ్యర్థులు హాజరు..

549 మంది గైర్హాజరు

బోధన్, నవంబర్ 29 (విజయక్రాంతి): తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(Telangana Police Recruitment Board) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఎస్‌ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష(SI Preliminary Written Examination) నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్(Nizamabad Police Commissionerate) పరిధిలో ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష నిర్వహణ కోసం కమిషనరేట్ పరిధిలో మొత్తం 20 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఈ పరీక్షకు మొత్తం 6,807 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా, 6,258 మంది పరీక్ష రాశారు. మరో 549 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేపట్టారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వివిధ పరీక్ష కేంద్రాలను సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. మొత్తంగా పరీక్ష ప్రశాంత వాతావరణంలో ముగిసింది.

మరిన్ని వార్తలు