వైన్సులు 47.. బెల్ట్ షాపులు 470!

28-10-2026 | 05:20am
  1. గ్రామాల్లో యథేచ్చగా బెల్టు మద్యం విక్రయాలు 
  2. మద్యం ధరలపై 20 రూపాయల వడ్డింపు 
  3. గ్రామాల్లో వీడీసీ ఆధ్వర్యంలో టెండర్ల అధికారులు 
  4. గ్రామాల్లో న్యూసెన్స్

కుబీర్, అక్టోబర్ 27 (విజయక్రాంతి) : నిర్మల్ జిల్లాలో(Nirmal District) బెల్ట్ షాపుల(Belt Shop) మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ(Excise Department) పరిధిలో మొత్తం 47 మద్యం దుకాణాలకు పర్మిషన్ ఉండగా అనాధికారికంగా గ్రామాల్లో 500 బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పల్లైనా పట్టణమైన బెల్ట్ షాపు లేనిదే జాడ కనిపించడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్న సంబంధిత అధికారులే వాటిని ప్రోత్సహిస్తూ ప్రతినెల మామూలుగా తీసుకుంటున్నారు అన్న ఆరోపణలు వినవస్తున్నాయి.

నిర్మల్ అన్ని ప్రాంతాల్లో బెల్ట్ మద్యం విక్రయాల దందా మూడు పూవులు ఆరుకాయలుగా వెరిజిల్లుతుండగా సంబంధిత అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినవస్తున్నాయి. మద్యం షాపులు సమయం ప్రకారం నడుస్తుండగా బెల్ట్ షాపులు మాత్రం రాత్రింబవళ్లు 24 గంటలు తెరిచి ఉండడం, వాటిలో మద్యాన్ని సేవించిన వారు గ్రామాల్లో పట్టణాల్లో రోడ్లు విధులపై న్యూసెన్స్ చేయడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో జనావాస ప్రాంతాల్లోని ఇండ్ల మధ్యన అనాధికారిక బెల్ట్ షాపులు నడుస్తున్న వాటిని నియంత్రించవలసిన పోలీస్ ఎక్సైజ్ శాఖ అధికారులు కనీస చర్యలు చేపట్టకపోవడం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో నిర్మల్ బైంసా ఖానాపూర్ మున్సిపాలిటీలు తోపాటు మొత్తం 400 గ్రామపంచాయతీలు ఉండగా ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు నడుస్తు న్నాయని ఆరోపణలు వినవస్తున్నాయి. ఆయా గ్రామాల్లో పట్టణాల్లో తండాల్లో విడిసి ఆధ్వర్యంలో బెల్ట్ షాపులకు ఓపెన్ టెండర్లు వేసి అమ్ముకునేందుకు అనుమతి ఇస్తున్నారు. లక్ష రూపాయల వరకు టెండర్ ఉండగా మేజర్ గ్రామపంచాయతీలో ఆరు నుంచి ఏడు లక్షల వరకు, మధ్య గ్రామపంచాయతీలో 4 లక్షల వరకు మద్యం టెండర్లను పట్టించుకున్న యువకులు గ్రామాల్లో ప్రత్యేక దుకాణాలను షెడ్యూలను ఏర్పాటు చేసి 24 గంటలు మద్యం విక్రయిస్తున్నారు. 

ప్రజలపై ఆర్థిక భారం 

నిర్మల్ జిల్లాలో నిర్వహిస్తున్న బెల్టు షాపుల్లో విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వైన్ షాపులో లభించే ఎన్నో రకాల మద్యం బెల్ట్ షాపుల్లోనే గ్రామీణ ప్రాంతాల్లో లభిస్తుందడంతో స్థానికులు మద్యాన్ని సేవించి మద్యం మత్తులో గ్రామాల్లో న్యూసెన్స్ చేస్తున్నారు. తాగిన మైకంలో రోడ్లపై హంగామా చేయడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా గ్రామాల్లో గ్రామం మధ్యన రోడ్ల పక్కన బెల్ట్ షాపులు ఉండడంతో ప్రజలు రోడ్డుపై వెళ్ళాలంటే జంపుతున్నారు.

మద్యం పార్టీలపై బెల్ట్ షాపులు దక్కించుకున్న వారు ఉన్న ధర కంటే అదనంగా 20 రూపాయలు ఎక్కువగా విక్రయించడం వల్ల మద్యం తాగే వారికి జేబుకు చిల్లులు పడుతున్నాయి. స్థానికంగా మద్యం లభించడంతో అతిగా తాగుతున్నారని గ్రామీణ ప్రజలు పేర్కొంటున్నారు. గ్రామంలో బెల్ట్ షాపులో మద్యం దొరకని పక్షంలో మద్యం తాగే వారి సంఖ్య తగ్గి అవకాశం ఉంది. గ్రామంలో కావాల్సిన బ్రాండ్లు 24 గంటలు దొరకడంతో వాటిని సేవించిన రోడ్లపై చెక్కర్లు కొడుతూ అరుస్తూ నానా హంగామా సృష్టించడంతో దారికుంట వెళ్లేవారు నానా అవస్థలు పడుతున్నారు. ద్విచక్ర వాహనాలు వారికి సైతం వారు అడ్డంగా రావడంతో ప్రమాదాలు జరిగితున్నాయి. 

ఫిర్యాదులు పెరుగుతున్నాయి 

నిర్మల్ జిల్లాలో వైన్ షాపులు  అనధి కారిగా బెల్ట్ షాపుల ను జనావాస ప్రదేశాల నుంచి దూరంగా ఏర్పాటు చేసేలా అధికా రులు చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యాప్తంగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటికీ కుంటాల కుబీర్ తానూర్ లోకేశ్వరం బైసా పట్టణం తో పాటు కడెం దస్తురాబాద్ ప్రాంతాల్లో ఫిర్యా దులు వచ్చినట్టు సమాచారం. గ్రామంలో బెల్ట్ షాపుల్లో 24 గంటల మద్యం విక్ర యాలు తాగడం వల్ల శాంతి పద్ధతుల సమస్య కూడా తలెత్తుతుంది. మద్యం మత్తులో దొంగతనాలు ఇతర నేరాలు చేస్తున్నారు. మద్యం తాగడం వల్ల కొన్ని కుటుంబాలు ఆర్థికంగా చిన్న భిన్నమై అవస్థలు పడుతున్నాయి. ప్రభుత్వం అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్ షాపులపై దృష్టి పెట్టి నియంత్రణ చేయాలని గ్రామీణ. పట్టణ నిరుపేద ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు