ఆసుపత్రి అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలి

26-11-2026 | 06:39pm

హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌ పాయ్

వరంగల్: మహాత్మా గాంధీ మెమోరియల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి(Super Speciality Hospital) ప్రాంగణంలో చేపట్టిన అభివృద్ధి పనులను మరింత వేగవంతంగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌ పాయ్ అధికారులను ఆదేశించారు. గురువారం వరంగల్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఆసుపత్రి కాంపౌండ్ వాల్స్, ప్రధాన ద్వారం, పార్కింగ్ ఏరియాలు, గార్డెనింగ్ పనులతో పాటు ఫైబర్ ప్లాస్టిక్ ప్యానెళ్ల ఏర్పాటు పనుల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రి ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దేలా చేపట్టిన గార్డెనింగ్  పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అభివృద్ధి పనులను సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ అండ్‌ బీ ఎస్‌ఈ సురేష్‌బాబు, ఈఈ దేవిక చౌహన్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎస్‌ఈ రాజ్‌కుమార్, నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ ప్రతినిధులు శరవణకుమార్, గణేష్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు