బీద విధవరాండ్రకు క్రిస్మస్ కానుక..

29-11-2026 | 04:18pm

వైడి రెడ్డిమల్ల ఫౌండేషన్ వితరణ..

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా పాస్టర్ రేట్ లోని సంఘాల్లో బీద విధవరాండ్రకు వైడి రెడ్డిమల్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ కానుకలు అందజేశారు. ఆదివారం ఖానాపూర్ పాస్టరేట్ లోని పెద్ద బెల్లాల్ ,చిన్నబెల్లాల గ్రామ సీఎస్ఐ సంఘాల్లో ఫౌండేషన్ తరపున ఖానాపూర్ చిత్రా మిషన్ ఐ కేర్ అండ్ ఆప్టికల్స్ వైద్య సహాయకులు చిత్రలత రెడ్డిమల్ల, ఏసుదాస్ రెడ్డిమల్లలు ఈ కానుకలు అందజేశారు.

ఈ సందర్భంగా స్థానిక పాస్టర్ రెవరెండ్ ఎస్ విజయ రావు మాట్లాడుతూ సమస్త ప్రజలకు క్రిస్మస్ శుభములు కలగాలని, లోక రక్షకుని జన్మమును జ్ఞాపకం చేసుకొని ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని పాడి పంటలు, ఉద్యోగంలో, వ్యవసాయంలో వ్యాపారాల్లో ,ప్రతి ఒక్కరూ వర్ధిల్లాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ అబ్రహం, సంఘం కమిటీ సభ్యులు  అమృతయ్య ,రాజారత్నం, సంజీవరావు, సంఘ సభ్యులు పలువురు ఉన్నారు.

మరిన్ని వార్తలు