బాధిత కుటుంబాలకు మంత్రి శ్రీధర్ బాబు పరామర్శ

28-10-2026 | 05:09pm

మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు

మంథని, అక్టోబర్ 28(విజయ క్రాంతి): మంథని మండలంలోని మల్లెపల్లి గ్రామంలో పలు కుటుంబాలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) పరామర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంథని పట్టణంలోని పెట్రోల్ బంక్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చింతల నవీన్ కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. అలాగే మల్లెపల్లి గ్రామ సర్పంచ్ లక్కాకుల సత్యనారాయణ తల్లి రాంబాయ్ ఇటీవల మృతి చెందడంతో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు. మంత్రి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు