జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలకు ప్రభుత్వ కళాశాల విద్యార్థి

06-11-2026 | 03:37pm

​సుల్తానాబాద్, నవంబర్ 06 (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శామీర్ పేట్ లోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్‌(Telangana Sports School)లో తెలంగాణ స్కూల్స్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్జిఎఫ్) ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన అండర్-19 ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆర్చరీ-2026 పోటీలలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి టి. యశ్వంత్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని కళాశాల స్పోర్ట్స్ ఇన్‌చార్జ్ కె. సునీల్ కుమార్ తెలిపారు.​

మహారాష్ట్రలోని అమరావతి వేదికగా డిసెంబర్ 16 నుండి 19 వరకు జరగనున్న జాతీయ స్థాయి (ఎస్ జి ఎఫ్ అండర్-19) ఆర్చరీ పోటీలలో యశ్వంత్ తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించి పాల్గొననున్నారు.​ ఈ సందర్భంగా జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థి యశ్వంత్‌ను కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ సి.హెచ్ ప్రభాకర్ ప్రత్యేకంగా అభినందించారు. యశ్వంత్ తన అద్భుతమైన ప్రతిభతో కళాశాలకు, మన ప్రాంతానికి ఎంతో గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. జాతీయ స్థాయి పోటీలలో కూడా పతకం సాధించి, మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ​ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, సిబ్బంది యశ్వంత్‌ను అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు