మచ్చుపేట యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన మంత్రి
సింగరేణి ఆధ్వర్యంలో 22 మంది యువతకు వెల్డింగ్‌లో నైపుణ్య శిక్షణ
ముత్తారం, నవంబర్ 04(విజయ క్రాంతి): గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు(Employment opportunities) కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Minister Duddilla Sridhar Babu) ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
మంత్రి ఆదేశాల మేరకు మచ్చుపేట గ్రామానికి చెందిన 22 మంది యువతకు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమం చేపట్టారు. సింగరేణి ఆర్జీ-1 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో ఎన్ఏసీ కేంద్రంలో యువతకు వెల్డింగ్ కోర్సులో శిక్షణ అందిస్తున్నారు.
గ్రామ సర్పంచ్ చిలివేరి జ్యోతి లక్ష్మణ్ ప్రత్యేక చొరవ తీసుకొని గ్రామ యువతకు ఈ అవకాశాలు కల్పించేందుకు కృషి చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని, ప్రభుత్వం, సంస్థలు అందిస్తున్న నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను యువత సద్వినియోగం చేసుకొని తమ భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలని సూచించారు.
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సహకరించిన మంత్రి శ్రీధర్‌బాబుకు, సింగరేణి ఆర్జీ-1 జనరల్ మేనేజర్ లలిత్ కుమార్‌కు, సంబంధిత అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ యువత అభివృద్ధికి, ఉపాధి కల్పనకు నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దంతుల రాకేష్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.