యాదవులు అన్ని రంగాల్లో రాణించాలి

14-10-2026 | 02:17pm
  1. సింగిల్ విండో డైరెక్టర్లకు మండల యాదవ సంఘం సన్మానం
  2. యాదవ సంఘం మండల అధ్యక్షుడు కృష్ణ కాంత్ యాదవ్

గంభీరావుపేట, అక్టోబర్ 14 (విజయక్రాంతి): యాదవులు ఐకమత్యంగా ముందుకు సాగుతూ అన్ని రంగాల్లో రాణించాలని గంభీరావుపేట మండల యాదవ సంఘం అధ్యక్షుడు దోమకొండ కృష్ణకాంత్ యాదవ్(Yadava Sangham President Domakonda Krishnakanth Yadav), ప్రధాన కార్యదర్శి బొంగు మల్లేశం యాదవ్ అన్నారు.

ఇటీవల సింగిల్ విండో చైర్మన్‌గా ఎన్నికైన వేషాల వెంకటితో పాటు డైరెక్టర్లుగా ఎన్నికైన యాదవ సామాజికవర్గానికి చెందిన గుడికాడి బాలయ్య (గంభీరావుపేట), చెరుకూరి మహేష్ (నాగంపేట)లను బుధవారం మండల యాదవ సంఘం ఆధ్వర్యంలో శాలువాలతో సింగిల్ విండో కార్యాలయంలో  ఘనంగా సన్మానించి మిఠాయిలు పంచుకున్నారు.

ఈ సందర్భంగా కృష్ణకాంత్ యాదవ్ మాట్లాడుతూ విద్యావంతులను ప్రోత్సహించి ఉన్నత స్థాయికి ఎదిగేలా సంఘం కృషి చేయాలన్నారు. చిన్నాపెద్ద తారతమ్యాలు లేకుండా పరస్పరం సహకరించుకుంటే యాదవులు అన్ని రంగాల్లో ముందుంటారని పేర్కొన్నారు.కార్యక్రమంలో మలుపల్లె, మల్లారెడ్దిపేట సర్పంచ్ లు బొల్లు సత్తయ్య యాదవ్,చేకూటి మహేష్ యాదవ్, నాయకులు గొడుగు దేవయ్య యాదవ్, అగ్గతి పోచయ్య యాదవ్, అగ్గతి రాజు యాదవ్, పెద్దవేణి వెంకట్ యాదవ్, కుమార్ యాదవ్, శ్రవణ్ యాదవ్ మల్లయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు