తాత్కాలిక మట్టి రోడ్డు ఏర్పాటు చేయాలి

07-10-2026 | 03:08pm

2వ రోజు రిలే నిరాహార దీక్ష

గంభీరావుపేట, అక్టోబర్ 7 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా  గంభీరావుపేట-లింగన్నపేట గ్రామాల మధ్య మానేరు వాగుపై తాత్కాలిక మట్టి రోడ్డు ఏర్పాటు చేసి బస్సు సౌకర్యం పునరుద్ధరించాలని గంభీరావుపేట గ్రామ సేవా కమిటీ(Gambhiraopet Village Service Committee) ఆధ్వర్యంలో గాంధీ చౌక్ వద్ద రిలే నిరాహార దీక్ష రెండవ రోజుకు చేరింది.

మానేరు వాగుపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులు మూడేళ్లుగా ముందుకు సాగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల వర్షాలకు ఎగువ మానేరు మత్తడి దూకడంతో తాత్కాలిక మట్టి రోడ్డు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయని తెలిపారు.

అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టి బస్సు సౌకర్యం పునరుద్ధరించాలని కోరారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు సిరిపురం రవి, చేపూరి ప్రభాకర్, రాగిశెట్టి నారాయణ, పార్థసారధి శర్మ, అబ్దుల్ మజాహర్, జెల్ల బుధయ్య ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు