దసరా, బతుకమ్మ పండుగలకు ముందస్తు ఏర్పాట్లు

07-10-2026 | 04:48pm

మల్లాపూర్, అక్టోబర్ 07 (విజయక్రాంతి): రాబోయే దసరా, బతుకమ్మ పండుగలను పురస్కరించుకుని మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలోని 3వ వార్డులో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వార్డు సభ్యుడు జంగ ప్రణయ్ (Ward Member Janga Pranay)తెలిపారు.

బుధవారం పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్తో కలిసి వార్డులో పర్యటించిన ఆయన రోడ్డు లైటింగ్, విద్యుత్ స్తంభాలు, రహదారుల పరిశుభ్రత, పారిశుద్ధ్యంతో పాటు బతుకమ్మ ఘాట్‌ను పరిశీలించారు. పండుగల సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కార్యదర్శితో చర్చించారు.ప్రజలు ఆనందంగా, ప్రశాంతంగా పండుగలను జరుపుకునేలా ముందస్తు చర్యలు చేపడుతున్నామని జంగ ప్రణయ్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు