ప్రహరీ గోడ లేక విద్యార్థులకు అవస్థలు

18-11-2026 | 05:52pm

కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలకు ప్రహరీ నిర్మించాలని తల్లిదండ్రుల విజ్ఞప్తి

గంభీరావుపేట, నవంబర్ 18 (విజయక్రాంతి): గంభీరావుపేట మండలం కొత్తపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ గోడ లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలలో సుమారు 30 మంది విద్యార్థులు చదువుతుండగా, ఇదే ప్రాంగణంలో ఐదు అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. వాటిలో మరో 30 మంది చిన్నారులు ఉన్నారు.

ప్రహరీ గోడ లేకపోవడంతో పాఠశాల ఆవరణలోకి కోతులు, కుక్కలు ప్రవేశిస్తుండటంతో విద్యార్థులు, చిన్నారుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ప్రహరీ నిర్మాణానికి నిధులు విడుదల చేయాలి

కొత్తపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ గోడ లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి నిధులు మంజూరు చేసి ప్రహరీ నిర్మాణం చేపట్టాలి.

బినమేని శ్రవణ్ యాదవ్, బీజేవైఎం జిల్లా నాయకులు కొత్తపల్లి

మరిన్ని వార్తలు