మూటకొండూరు, రాజపేటలో 1,164 మందికి కొత్త చేయూత పెన్షన్లు
మంజూరు పత్రాలు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య...
ఆలేరు, నవంబర్ 18 (విజయక్రాంతి): అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు(Welfare Schemes) అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య(Beerla Ailaiah) అన్నారు. బుధవారం మోటకొండూరు మండల కేంద్రంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో 416 మంది, రాజపేట మండల కేంద్రంలోని మీనాక్షి ఫంక్షన్ హాల్లో 748 మంది లబ్ధిదారులకు నూతన చేయూత పెన్షన్(Cheyutha Pension) మంజూరు పత్రాలను ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తామని, ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం పాటుపడతామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.