విద్యార్థినుల భద్రతకు షీ టీమ్ భరోసా
తంగళ్లపల్లి, నవంబర్ 21 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఆదేశాల మేరకు షీ టీమ్ (SHE Teams) బృందం తంగళ్లపల్లి మండలంలోని జిల్లెల్ల, నేరెళ్ల గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు మహిళా భద్రతపై అవగాహన (Awareness Programme) కల్పించింది.
ఈ సందర్భంగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ (Good Touch & Bad Touch), పోక్సో చట్టం (POCSO Act), ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్, సైబర్ నేరాలు (Cyber Crimes), 112 అత్యవసర సేవలపై విద్యార్థులకు వివరించారు. సోషల్ మీడియా (Social Media)లో అపరిచితులతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎవరైనా వేధింపులకు గురైతే వెంటనే షీ టీమ్ నంబర్ 87126 56425కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. విద్యార్థినులు ఎలాంటి భయం లేకుండా తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.