రైతుల సౌకర్యార్థం రూ.9.55 లక్షలతో 8 టవర్ లైట్ల ఏర్పాటు
వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద మెరుగైన వెలుతురు కోసం చర్యలు.
కోనరావుపేట నవంబర్ 21 (విజయక్రాంతి): రైతుల(Farmers') సౌకర్యార్థం కోనరావుపేట మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ(Agricultural Market Committee) ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్(Adi Srinivas) నిధులతో 9.55 లక్షల వ్యయంతో టవర్ లైట్లను ఏర్పాటు చేశారు. ఆయన ఆదేశాల మేరకు మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య టవర్ లైట్లను ప్రారంభించారు. మండలంలోని నాగారం గ్రామంలో ఒకటి, కోనరావుపేట మండల కేంద్రంలో రెండు, మామిడిపల్లి గ్రామంలో రెండు, వెంకట్రావుపేటలో ఒకటి, వట్టిమల్ల గ్రామంలో ఒకటి, మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో రెండు టవర్ లైట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
వడ్ల కొనుగోలు కేంద్రాలకు రాత్రి సమయాల్లో వచ్చే రైతులకు ఇబ్బందులు కలగకుండా, కేంద్రాల వద్ద మెరుగైన వెలుతురు కల్పించేందుకు టవర్ లైట్ల ఏర్పాటు చేపట్టడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.రైతుల సౌకర్యార్థం నిధులు మంజూరు చేయించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కోనరావుపేట పీఏసీఎస్ చైర్మన్ చెపూరి గంగాధర్, కొలనూరు సింగిల్ విండో చైర్మన్ బొమ్మెన భాస్కరరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మానుక సత్యం, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బోయిని దేవరాజు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తాళ్లపెల్లి ప్రభాకర్, డైరెక్టర్లు నాయిని ప్రభాకర్ రెడ్డి, ససాల మల్లారెడ్డి, మందాల లింబయ్య, మ్యాకల ప్రభాకర్ రెడ్డి, అజీమ్ పాషా తదితరులు పాల్గొన్నారు.
అలాగే ఆయా గ్రామాల సర్పంచులు అప్పాల నాగభూషణం, ఖాసిరాం, పన్నాల లక్ష్మారెడ్డి, సింగం శ్రీహరి, గ్రామ శాఖ అధ్యక్షులు ముదం ప్రదీప్, జనార్ధన్, వేణు, లంబ రాజు, పల్లె రవీందర్ రెడ్డి, కర్రె శంకర్, ఉపసర్పంచులు, పాలకవర్గ సభ్యులు, కొలనూరు సింగిల్ విండో డైరెక్టర్లు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.