బుగ్గపాడు ఫుడ్ పార్క్‌లో బినామీలు!

02-11-2026 | 05:30am
  1. తెర వెనుక ఎవరు ఉన్నా వదలి పెట్టం
  2. బీజేపీ తమిళనాడు రాష్ట్ర సహా 
  3. ఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి 

నవంబర్ 1 (విజయక్రాంతి): బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ తమిళనాడు రాష్ట్ర సహ ఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి(State Co-in-charge Ponguleti Sudhakar Reddy) ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘బుగ్గపాడు ఫుడ్ పార్క్‌లో 200 కోట్లతో దీపక్ నెటిజెన్ కంపెనీ వారి టర్నోవర్ 22 కోట్లు అవుట్ రైట్ సేల్ కింద ఇచ్చారు. దేశంలో ఎక్కడా కూడా ఇటువంటి వింత లేదు.

72 ఎకరాలు 25 లక్షల చొప్పున ఎవరి సొ మ్ము అని ఇస్తారు. రొయ్యల సాగు సత్తుపల్లిలో లేనే లేదు. బుగ్గపాడు ఫుడ్ పార్క్ తెర వెనుక ఎవరు ఉన్నారో, బినామీలుగా ఎవరు చేపిస్తున్నారో ఎవరినీ వదిలిపెట్టం. సింగరేణి బొగ్గు గనులలో జరుగుతున్న అవినీతి, కుంభకోణం గురించి నా దగ్గర 5 గంటలు మాట్లాడే సమాచారం ఉంది. బుగ్గపాడు ఫుడ్ పార్క్ సమస్యను విడిచి పెట్టేది లేదు.

జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి రైతాంగాన్ని గాలికి వదిలేశారు. గనుల దోపిడీ, భూముల దోపిడీ, ఇసుక దోపిడీ కొనసాగుతున్నది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ఒకే తోవకు చెందిన పార్టీలు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత, నిరుద్యోగులు బీజేపీ వైపు మొగ్గు చూస్తున్నారు. సరైన సమయంలో బీజే పీ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటిస్తాం, అభ్యర్థి భారీ మె జారిటీతో గెలుస్తారు.

కమ్యూనిస్టులు ఎన్నికలు రాగా నే సిద్ధాంతాలను పక్కన పెట్టి పొత్తులు పెట్టుకుంటారు. కమ్యూనిస్టు పార్టీలు కమర్షియల్ పార్టీలుగా మారిపోయారు. ఇందిరమ్మ ఇళ్లు కాంగ్రెస్ పార్టీ వా ళ్ళకే ఇస్తారా. ఇప్పటివరకు ఎవరికి ఇచ్చారో బహిరంగ పరచండి. కాంగ్రెస్ పార్టీ తుక్డే గ్యాంగ్‌లతో ఇం డి కూటమి పేరుతో అంతా ఏకమయ్యారు.

వీళ్లు చేసే ఆందోళనలో దేశ వ్యతిరేకులు, ఉగ్రవాదులు సైతం పాల్గొంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో బాబు జగ్జీవన్ విగ్రహం నుంచి మహా పాదయాత్ర చేపడుతున్నాం. దీనిని విజయవంతం చేయాలి’ అని అన్నారు. ఎల్ నినో ప్రభావంతో రైతులు బాధపడుతుంటే అన్నమో రామచంద్ర అని రైతులు బాధపడుతుంటే పంటలు వేయొద్దని సీఎం చెప్పడం తగదన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ లతో, 22ఏ లో భూములను దోచుకుంటూ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. 13 కోట్ల 39 లక్షల ఓట్ల ను సర్ ద్వారా ఎన్నికల కమిషన్ నోటీసులు ఇచ్చిందని, అందులో చనిపోయిన వారు, బదిలీ అయినవారు, రెండు చోట్ల ఓటు కలిగిన వారు ఉన్నారని తెలిపారు. నిజమైన ఓటు ఒక్కటి కూడా పోలేదన్నారు. 


మరిన్ని వార్తలు