విద్యార్థులకు కరాటే బెల్టుల అందజేత
ఎల్బీనగర్, నవంబర్ 22: రాజు నాయక్ కరాటే అకాడమీ(Raju Naik Karate Academy) ఆధ్వర్యంలో ఎల్బీనగర్లో కరాటే గ్రేడింగ్ టెస్ట్, బెల్ట్ అవార్డు ప్రదానోత్సవ వేడుకలను ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అకాడమీకి చెందిన పలువురు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ కరాటే నైపుణ్యాలను ప్రదర్శించారు.
గ్రేడింగ్ టెస్ట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నిర్వాహకులు, అతిథులు వివిధ స్థాయిల బెల్టులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా అకాడమీ ప్రతినిధులు మాట్లాడుతూ.. నేటి సమాజంలో ప్రతి ఒక్కరికీ ఆత్మరక్షణ విద్య ఎంతో అవసరమని పేర్కొన్నారు. కరాటే నేర్చుకోవడం వల్ల విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఏకాగ్రత, క్రమశిక్షణ, ఆత్మస్థైర్యం పెంపొందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అకాడమీ కోచ్, మాస్టర్ రాజు నాయక్,కిషోర్ మాస్టర్, ఈశ్వర్ మాస్టర్, రాంచరణ్ మాస్టర్, విద్యార్థుల తల్లిదండ్రులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.