భక్తిశ్రద్ధలతో మహాలింగార్చన
22-11-2026 | 09:14pm
ఎల్బీనగర్, నవంబర్ 22: కార్తీక మాసం సందర్భంగా బీఎన్ రెడ్డి నగర్ డివిజన్(BN Reddy Nagar Division)లోని గాయత్రి నగర్ ఫేజ్ 4 కాలనీలో శ్రీ శారదా చంద్రమౌళీశ్వర స్వామి మహాలింగార్చన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. పంతుడు భువనగిరి దత్తుశర్మ, బ్రహ్మశ్రీ చేబియ్యం శ్రీనివాస్ శర్మ అవధాని, కృష్ణ యజుర్వేద పండితులు, జ్యోతిష, వాస్తు, సంస్కృత, తర్క, మీమాంస, ధర్మ శాస్త్ర, ఆగమ పండితులు పాల్గొన్నారు. లింగార్చన ప్రాముఖ్యం, శివపురాణ, ఆగమ విషయాలపై అద్భుతమైన ప్రవచనములు వినిపించారు.