వికసిత్ భారతే లక్ష్యం

30-10-2026 | 05:35am
  1. తెలంగాణ రైజింగ్
  2. పెట్టుబడులతో రండి.. చరిత్ర సృష్టిద్దాం: సీఎం రేవంత్‌రెడ్డి
  3. పెట్టుబడిదారులకు నాది భరోసా
  4. 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా  సీఎం 
  5. ఢిల్లీలో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 కర్టెన్ రైజర్ కార్యక్రమం

హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): తెలంగాణ రైజింగ్‌లో భాగస్వా ములు కావాలని అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆహ్వానించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం పూచీ ఇచ్చి, మద్దతుగా నిలుస్తుందని, రాష్ట్రంలో పెట్టే ప్రతి పెట్టుబడికి తనది భరోసా అని సీఎం హామీ ఇచ్చారు.

హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లో గురువారం రాత్రి నిర్వహించారు. కార్యక్రమానికి కేంద్ర వాణి జ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సన్నాహక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన విధాన నిర్ణయాలు, ప్రభుత్వ సహకారం అందించేందుకు తాను వ్యక్తిగతంగా కృషి చేస్తానని స్పష్టం చేశారు.

‘తెలంగాణ రైజింగ్. పెట్టుబడులతో రండి.. చరిత్ర సృష్టిద్దాం’ అని సీఎం అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రైజింగ్ లక్ష్యం వికసిత్ భారత్ -2047 దార్శనికతకు అనుగుణంగా ఉంటుందని ఆయన తెలిపారు. 2047నాటికి భారత్ 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే సమయంలో దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 5 శాతం నుంచి 10 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం వివరించారు. 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని సీఎం ప్రకటించారు.

తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్న పారిశ్రామికవేత్తలు తమ పెట్టుబడి మొత్తాన్ని, వ్యాపార వృద్ధిని, లాభాల అంచనాలను రెట్టింపు చేయాలని కోరారు. పారిశ్రామికవేత్తలు తమ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రభుత్వం నుంచి ఏం కావాలో చెప్పాలని, విధానపరమైన మార్పుల నుంచి అవసరమైన సహకారం వరకు అన్నింటినీ అందించేందుకు వ్యక్తిగతంగా తాను బాధ్యత తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

తెలంగాణకు కేంద్రం సహకరిస్తోంది. 

కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై పెట్టుబడిదారులకు సందేహాలు ఉండొచ్చని సీఎం రేవం త్‌రెడ్డి అన్నారు. అయితే, అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్(Union Minister Piyush Goyal) ముఖ్య అతిథిగా హాజరుకావడమే ఇందుకు నిదర్శనమని సీఎం తెలి పారు. దేశంలో ఏడు హైస్పీడ్ రైలు కారిడార్ల ఏర్పాటుకు కేంద్రం నిర్ణయించగా, వాటిలో హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, పుణె కు మూడు కారిడార్లు కేటాయించారని తెలిపారు.

వరంగల్, ఆదిలాబాద్‌లో  కొత్త వి మానాశ్రయాల ఏర్పాటుకు కూడా కేంద్రం సహకరిస్తోందన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు విస్తరణ, నేవీలో-ఫ్రీక్వెన్సీ రాడా ర్ స్టేషన్‌తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్రం నుంచి సహకారం అందు తోందని సీఎం తెలిపారు. దేశాభివృద్ధి, ప్రజాసేవ విషయంలో రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంద న్నారు.

అభివృద్ధి విషయంలో ప్రభుత్వ అతి జోక్యానికి బదులు సమర్థ పాలన అవసరమని అభిప్రాయపడ్డారు. పారిశ్రామికవేత్తలు విజయాలు సాధించే మార్గంలో ఉన్న అడ్డంకులను తొలగించడమే తన బాధ్యతని తెలిపారు. తన సహచరుడు, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గతంలో భారత వైమానిక దళంలో సేవలందించారని, ఆయన సూచనతోనే తెలంగాణలో డిఫెన్స్‌కు సంబంధించి రక్షా ఎక్స్‌పోను నిర్వహిస్తున్నామని అందుకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ధన్యవాదాలు అని సీఎం అన్నారు.

ప్రపంచ నగరంగా గుర్తింపు.. 

హైదరాబాద్‌కు నాలుగు వందల ఏళ్ల క్రితమే ప్రపంచ నగరంగా గుర్తింపు ఉందని సీఎం తెలిపారు. ప్రపంచీకరణ అనే మాట ప్రాచుర్యంలోకి రాకముందే అనేక దేశాల నుంచి వ్యాపారులు హైదరాబాద్‌కు వచ్చి వ్యాపారాలు చేసేవారని గుర్తు చేశారు. చార్మినార్ పరిసరాల్లో ముత్యాలు, సుగంధ ద్రవ్యాలు, నఖాసీ వస్తువుల వ్యాపారం జరిగేదని గుర్తు చేశారు. నిజాం పాలనలో హైదరాబాద్‌లో అనేక చారిత్రక కట్టడాలు, అంత ర్జాతీయ స్థాయి మ్యూజియాలు, టంకశాల, విమానాశ్రయం, రైల్వే వ్యవస్థ, విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయని సీఎం తెలిపారు.

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్), అజయ్ బంగా (ప్రపంచ బ్యాంకు), శంతను నారాయణ్ (అడోబ్), ప్రేమ్ వత్స వంటి వారు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు అంతర్జాతీయ స్థాయి ప్రతిభావంతులను అందించడంలో హైదరాబాద్‌కు ప్రత్యే క గుర్తింపు ఉందని సీఎం తెలిపారు.

రాజీవ్, పీవీ సేవలు మరువలేనివి.. 

భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు సిద్ధమవుతున్న తరుణంలో దేశాభివృద్ధికి బాటలు వేసిన నాయకులను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. యువ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ కంప్యూటర్, టెలికం రంగాల్లో తీసుకొచ్చిన మార్పు లు దేశ ప్రగతికి పునాది వేసిందని సీఎం కొనియాడారు. నేడు ఫోన్, ఇంటర్నెట్ లేని జీవితం ఊహించలేని పరిస్థితి ఏర్పడిందంటే అందుకు ఆనాటి సంస్కరణలే కారణమన్నారు. రాజీవ్‌గాంధీ హైదరాబాద్‌లో పైలట్ శిక్షణ పొందారని, అందుకే హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టామని సీఎం తెలిపారు.

1991లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పీవీ నరసింహారావు దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో కీలక సంస్కరణలు తీసుకొచ్చారని సీఎం తెలిపారు. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీక రణ విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశ చూపారని వివరించారు. హైదరాబాద్ జీవన విధానంలోనే ప్రపంచ దృక్పథం ఉందని, సంస్కరణలు, పారిశ్రామిక అభివృద్ధి, వ్యాపార స్ఫూర్తి తెలంగాణ ప్రజల జీవన విధానంలో భాగమని రేవంత్‌రెడ్డి అన్నారు. 1991 నుంచి వివిధ రాజకీయ పా ర్టీలు అధికారంలో ఉన్నప్పటికీ, హైదరాబాద్‌లో పెట్టుబడులకు అన్ని ప్రభుత్వాలు తమ వంతు సహకారం అందించాయని తెలిపారు. 

హైదరాబాద్‌కు ప్రపంచంతోనే పోటీ.. 

హైదరాబాద్ పోటీ ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు నగరాలతో కాదని,  న్యూ యార్క్, లండన్, టోక్యో, సియోల్, దుబా య్ వంటి ప్రపంచ నగరాలతోనేనని సీఎం అన్నారు. ప్రపంచస్థాయి ఆలోచనలు, మెరుగైన విధానపరమైన సూచనలను పారిశ్రా మికవేత్తలు అందించాలని కోరారు. వారి సూచనలను ప్రభుత్వ విధానాల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.  తెలంగాణ ప్రగతి పథంలో ముందుకు సాగుతోందని, ఈ ప్రయాణంలో ప్రపంచ పెట్టుబడిదారు లు భాగస్వాములు కావాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

అంతా కలిసి ముందుకు సాగితే చరిత్ర సృష్టించగలమని సీఎం రేవం త్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి, ఎంపీలు అభిషేక్ మను సింఘ్వీ, రేణుకా చౌదరి, డాక్టర్ మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయ క్, సురేశ్ షెట్కార్, రామసహాయం రఘురాంరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఉన్నతాధికారులు, అంతర్జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తలు, విధాన నిర్ణేతలు, అధికారులు పాల్గొన్నారు. 

ఐఎస్‌ఎమ్‌లో భాగస్వామ్యం చేయండి: మంత్రి శ్రీధర్‌బాబు

సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్‌ఎమ్) 2.0లో తెలంగాణను భాగస్వామ్యం చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఫలితంగా... ఫ్యాబ్ ఇండస్ట్రీ, చిప్ డిజైన్ విభాగాల్లోనూ తెలంగాణ అగ్రగామిగా ఎదిగేందుకు మరింత అనుకూల వాతావరణం ఏర్పడుతుందన్నారు. గురువారం ఢిల్లీలో నిర్వహించిన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ -2026 కర్టెన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర డిఫెన్స్ ఎగుమతులు గతంతో పోలిస్తే 103 శాతం పెరిగాయన్నారు. రాష్ట్రంలో డేటా సెంటర్ల సామర్థ్యాన్ని 2030 నాటికి 5 గిగావాట్లకు చేర్చేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి చేర్చాలనే సంకల్పంతోనే గతేడాది తెలంగాణ రైజింగ్ విజన్ కు శ్రీకారం చుట్టామన్నారు.

ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, టాలెంట్ పూల్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా అమలు చేస్తున్న విధానాలు రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి ఊతమిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులకున్న అనుకూలతలను వివరించి పారిశ్రామికవేత్తలను రైజింగ్ తెలంగాణ విజన్ లో భాగస్వామ్యం చేసేందుకే ఢిల్లీలో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ - 2026 కర్టెన్ రైజర్ ను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనాలని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు పారిశ్రామికవేత్తలను కోరారు.


మరిన్ని వార్తలు