పుష్కరాల నాటికి అంతా సిద్ధం చేయాలి

30-10-2026 | 05:05am
  1. మార్చి నాటికి కాళేశ్వరం ప్రధాన ఆలయ పునర్నిర్మాణం పూర్తవ్వాలి
  2. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్
  3. ఆలయ నిర్మాణ పనుల పరిశీలన

భూపాలపల్లి/కాళేశ్వరం/మంథని, అక్టోబర్ 29 (విజయక్రాంతి): గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్(Endowments Principal Secretary Sailaja Ramaiyer) అధికారులను ఆదేశించారు. ఆలయ అభివృద్ధితో పాటు అష్టతీర్థాల ఘాట్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.

గురువారం దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఆమె కాళేశ్వరంలో పర్యటించారు. ప్రధాన ఆల యం, రామాలయం, జ్ఞానవాపి బావి, శుభానందిని అమ్మవారి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. విజయ గణపతి ఆలయ నిర్మాణ ప్రాంతంలో కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించారు. అనంతరం సరస్వతి ఘాట్‌ను సందర్శించి అష్టతీర్థాల అభివృద్ధి, ఘాట్ల నిర్మాణం, భూసేకరణ, బోట్ జెట్టీ ఏర్పాటుపై అధికారులను వివరా లు అడిగి తెలుసుకున్నారు.

ఆలయ ఈఓ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో శైలజా రామ య్యర్ మాట్లాడుతూ.. ప్రధాన ఆలయంతో పా టు ఉపాలయాలు, మండపాల నిర్మాణాలను నా ణ్యతలో రాజీ లేకుండా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. అష్టతీర్థాల ఘాట్ల ఫౌం డేషన్ డ్రాయింగులు, డ్రైనేజీ, విద్యుత్ డిజైన్లను త్వరగా ఖరారు చేసి పనులు ప్రారంభించాలని సూచించారు. అవసరమైన యంత్రాలను అందుబాటులో ఉంచడంతో పాటు కార్మికుల సంఖ్యను పెంచాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు.

ఆలయ నిర్మాణ పనులపై ప్రతి వారం సమీక్ష నిర్వహించాలని, జిల్లా కలెక్టర్ స్థాయిలో నిరంతర పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. తాను ప్రతి నెలా క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల పురోగతిని పరిశీలిస్తాన న్నారు. రహదారులు, ఇతర మౌలిక వసతుల అ భివృద్ధి పనులను కూడా పుష్కరాల అవసరాలకు అనుగుణంగా చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో ధార్మిక సలహాదారు గోవింద హరి, సబ్ కలెక్టర్ సౌరవ్ శర్మ, ఇంజినీరింగ్ అధికారులు, ప ర్యాటక శాఖ ప్రతినిధులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, కాంట్రాక్టర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

మంథనిలో పనుల పరిశీలన

దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంథనిలోని గోదావరి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్ పరిశీలించారు. మంథని పుష్కర ఘాట్ పునర్నిర్మా ణం, విస్తరణ పనులకు ప్రభుత్వం రూ.23 కోట్లు మంజూరు చేసిందని, గౌతమేశ్వర స్వామి ఆలయాన్ని రూ.10 కోట్లతో ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం పునర్నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.

2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపడు తున్నట్లు తెలిపారు.  కాశీ తరహాలో మంథనిలో ప్రతిరోజూ సాయంత్రం గోదావరి నదికి సప్త హారతులు నిర్వహించేలా ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. పుష్కర ఘాట్ పునర్నిర్మాణం, విస్తరణ పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయిందని, కాంట్రాక్టర్ ఎంపిక కూడా పూర్తయినందున త్వరలోనే పనులు ప్రారంభం కాను న్నాయని వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చి చివ రి నాటికి పనులు పూర్తి చేసేలా జిల్లా కలెక్టర్ కో య శ్రీహర్ష ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

మంథనితో పాటు ఓదెల, రామగుం డం ప్రాంతాల్లోనూ చిన్న పుష్కర ఘాట్లు ఏర్పా టు చేయనున్నట్లు శైలజ రామయ్యార్ తెలిపారు. మంథనిలోని గౌతమేశ్వర స్వామి ఆలయాన్ని రూ.10 కోట్ల వ్యయంతో ఆగమశాస్త్ర నిబంధనలకు అనుగుణంగా పునర్నిర్మిస్తున్నట్లు తెలిపారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆమెవెంట అదనపు కలెక్టర్ శ్రీరాములు, రెవెన్యూ డివిజనల్ అధికారి సురేష్ ఉన్నారు.

మరిన్ని వార్తలు