సాగర్ చివరి రెడ్డి ఎమ్మెల్యే జయవీర్‌రెడ్డి
టీఆర్పీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) చేపట్టిన పాదయాత్ర గురువారం నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని హాలియాకు చేరుకుంది. హాలియా సెంటర్లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో తీన్మార్ మల్లన్న మాట్లాడారు. 1986లో నాటి సీఎం ఎన్టీ రామారావు బీసీలకు 45 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నంబర్ 166 విడుదల చేస్తే, నాటి క్యాబినెట్ మంత్రిగా ఉన్న జానారెడ్డి.. రవీందర్‌రెడ్డి అనే వ్యక్తితో కలిసి హైకోర్టులో కేసు వేయించి బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నారని సంచలన విషయాన్ని వెల్లడించారు.
కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో 42% రిజర్వేషన్ పెంచుతామని చెప్పి అసెంబ్లీలో దొంగ బిల్లు పెట్టారన్నారు. బీసీ పిల్లల స్కాలర్‌షిప్‌ల కోసం బడ్జెట్లో రూ. 198 కోట్లు అని చూపి, రూ. 365 కోట్లు ఖర్చు చే సినట్లు రాసి, దాదాపు రూ. 1,600 కోట్ల బీసీ బిడ్డల సొమ్మును రెడ్డి కాంట్రాక్టర్ల జేబుల్లోకి మళ్లించారన్నారు.
బీసీ బిడ్డలను ఐఏఎస్, ఐపీఎస్‌లుగా తీర్చిదిద్దడానికి రూ. 50 కోట్లు కేటాయించి, ఖర్చు చేసింది కేవలం రూ. 4 లక్షలు మాత్రమేనని, మిగతా రూ. 50 కోట్లు మాయం చేసి జానారెడ్డి కొడుకులు మాత్రం ఒకడు ఎమ్మెల్యే, ఇంకొకడు ఎంపీ అయ్యారని ధ్వజమెత్తారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మొత్తం 2,33,514 ఓట్లు ఉంటే, బీసీల ఓట్లే 1,27,408 పైగా ఉన్నాయన్నారు. గతంలో గౌడ సామాజికవర్గానికి చెందిన నిమ్మల రాములు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు తెస్తే, ఆయన్ని రాజకీయంగా అనగదొక్కి జానారెడ్డి తన కుటుంబాన్ని తెచ్చి కూర్చోబెట్టారని మండిపడ్డారు.
‘జానారెడ్డి రాసి పెట్టుకో.. ఇదే హాలియా గడ్డ మీద నుంచి చెప్తున్నా, నీ కొడుకే చివరి ఓసీ ఎ మ్మెల్యే! సరిగ్గా 766 రోజుల తర్వాత నీ కొ డుకుని రాజకీయంగా కథ చేస్తాం‘ అని స వాల్ విసిరారు. 1957 నుంచి ఇప్పటివర కు ఒక్క ముస్లిం ఆడబిడ్డ కూడా చట్టసభల్లోకి అడుగుపెట్టలేదని, తమ పార్టీ ద్వారా ముస్లిం మహిళలను అసెంబ్లీకి పంపుతామ ని హామీ ఇచ్చారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రజినీ కుమార్ యాదవ్,క్రమశిక్షణ కమిటీ చైర్మన్ నర్సయ్య గౌడ్, రాష్ట్ర కార్యదర్శి, జెడ్పీ వైస్ చైర్మన్ బీకు నాయక్,రంగారెడ్డి ప్రధాన కార్యదర్శి కోట్ల వాసుదేవ్తదితరులున్నారు.