సన్న బియ్యం.. కొనలేం! తినలేం!
- క్వింటాలు రూ.11 వేలు..
- సామాన్యుడి బడ్జెట్ తలకిందులు
- మరో ఆరు నెలలు ధరలు మోతే
రంగారెడ్డిబ్యూరో,అక్టోబర్ 26(విజయక్రాంతి): రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు(Prices of essential commodities) సామాన్యుడి నడ్డి వి రుస్తున్నాయి. ఇప్పటికే పప్పుదినుసులు, వం టనూనెల బాదుడుతో సతమతమవుతున్న పేద, మధ్యతరగతి ప్రజలపై బియ్యం ధరల(Rice prices) భారం నిప్పులు చెరుగుతోంది. నాణ్యత, రకాన్ని బట్టి క్వింట్పా రూ.1,000 నుంచి రూ.2,000 వరకు ధరలు పెరగడంతో వంటింటి బడ్జెట్ పూర్తిగా తలకిందులైంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం క్వింటాలు రూ.9,500 నుంచి రూ.11,000 వరకు చేరగా, చిల్లర మార్కెట్లో కిలో ధర రూ.90 నుంచి రూ.100 తాకింది.
* ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనూ ఇదే పరిస్థితి.....
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా(Undivided Ranga Reddy District) వ్యాప్తంగా సన్న బియ్యం లభ్యత తగ్గడంతో ధరలు చుక్కలనంటుతున్నాయి. హైదరాబాద్ నగరానికి ఆనుకుని ఉన్న రంగారెడ్డి జిల్లా శివారు ప్రాం తాల్లో (ఇబ్రహీంపట్నం, మంగళ్‌పల్లి, బొంగుళూరు, శేరిగూడ, శంషాబాద్, మొయినా బాద్, చేవెళ్ల తదితర మండలాలు) మిల్లర్లు, దళారులు ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా దందా సాధించేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు.
సన్న బియ్యం కొరతను ఆసరాగా చేసుకుని, ప్రభుత్వం ఇచ్చే (పీడీఎస్) రేషన్ బియ్యాన్ని కిలో రూ.15 నుంచి రూ. 20కి లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసి, వాటిని రైస్ మిల్లుల్లో రీసైక్లింగ్ చేసి, పాలిష్ పట్టి రూ.90 నుండి రూ.100కి రీ-సేల్ చేసే పెద్ద దందా బహిరంగంగా సాగుతోంది. గత కొన్ని నెలల్లోనే రంగారెడ్డి జిల్లా పరిధిలో ఇ టువంటి రేషన్ బియ్యం రీసైక్లింగ్, బ్లాక్ మా ర్కెట్ తరలింపులపై 120కి పైగా కేసులు న మోదవడమే ఇక్కడి తీవ్రతకు అద్దం పడుతోంది.
తగ్గిన దిగుబడి.. ఎల్ నినో ప్రభావం....
గత వానాకాలం వాతావరణ మార్పులు, నీటి కొరత, సమయానికి నీటి తడులు అందకపోవడంతో సన్నరకం వరి దిగుబడి గణనీయంగా తగ్గింది. గతంలో 1.01 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం నమోదు కాగా, ఈ ఏడాది 1.47 లక్ష ల ఎకరాల్లో సాగైనా, అం దులో సన్న రకాలు గత ఏడాదితో పోలిస్తే దాదా పు 12 వేల ఎకరాల వర కూ తగ్గిపోయాయి. ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉ న్నందున, రాబోయే యాసంగి (రబీ) సీజన్లో నీటి వినియోగం తక్కువగా ఉండే అరుతడి పంటలు వేసుకోవాలని ప్ర భుత్వం సూచిస్తుండటంతో రానున్న రోజు ల్లో బియ్యం లభ్యత మరింత తగ్గే ప్రమాదం పొంచి ఉంది.
* బ్లాక్ మార్కెట్లో నిల్వలు!
బియ్యం కొరత రాబోతోందన్న వార్తలను ఆసరాగా చేసుకుని దళారులు, కొందరు వ్యాపారులు... సిండికేట్ గా మారుతున్నా రు. ప్రైవేటు గోదాముల్లో బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేస్తున్నారు. రెండు నెలల క్రి తం 25 కిలోల సన్న బియ్యం బ్యాగ్ రూ. 1,600 - రూ.1,700 ఉండగా, ప్రస్తుతం అది రూ.2,400 నుండి రూ.2,700కి చేరింది. గోదాముల్లో నిల్వలు ఉంచుతూ మార్కెట్లోకి తక్కువ పరిమాణంలో వదులుతూ విపరీతమైన కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు.
* మరో ఆరు నెలలు ధరల మోతే...
మార్కెట్ నిపుణులు, వ్యాపార వర్గాల అంచనా ప్రకారం రాబోయే ఆరు నెలల వరకు బియ్యం ధరలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. కొత్త పంట మార్కెట్‌కి పూర్తిస్థాయిలో వచ్చే వరకు ఈ భారం తప్పదని భావిస్తున్నారు. పౌరసరఫరాల శాఖ, విజిల్స్, టాస్క్‌ఫోర్స్ అధికారులు తక్షణమే స్పందించి రంగారెడ్డి జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా బియ్యం నిల్వ ఉంచిన గోదాములు, రైస్ మిల్లులపై దాడులు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.