నాగలిగిద్ద జడ్‌పీహెచ్‌ఎస్‌కు కొత్త హెచ్‌ఎం

08-10-2026 | 05:05am

ఎట్టకేలకు మారుతి జాదవ్‌కు బాధ్యతలు 

నాగలిగిద్ద, అక్టోబర్ 7 : నాగల్గిద్ద మండల(Nagalgidda Mandal) కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడి(Zilla Parishad High School Principal) సమస్యపై విజయక్రాంతి ప్రచురించిన కథనానికి ఎట్టకేలకు ఫలితం దక్కింది. గత జూన్ 15న ‘బడిబాటలో హెచ్‌ఎం జాడెక్కడ?’  అనే శీర్షికతో విజయక్రాంతి స్పెషల్ కథనాన్ని ప్రచురించింది. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిగా(Gazetted Principal) బాధ్యతలు ఉన్నప్పటికీ జిల్లా సైన్స్ అధికారిగా కొన సాగుతుండటంతో పాఠశాల నిర్వహణ(School Management), కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల పర్యవేక్షణపై ప్రభావం పడుతోందని గ్రామస్తులు వ్యక్తం చేసిన ఆందోళనను కథనంలో ప్రస్తావించింది.

‘విధి నిర్వహణలో నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం’, ‘ఉపాధ్యాయులతోనే సమస్య’, ‘కొత్త హెచ్‌ఎంను నియమించాలని డిమాండ్’ అంటూ సమస్య తీవ్రతను అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. అనంతరం కూడా రెగ్యులర్ హెచ్‌ఎం నియామకం కోసం స్థానికులు, ప్రజాసంఘాల నాయకులు పలుమార్లు అధికారులకు విజ్ఞప్తులు చేశారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు విద్యాశాఖ స్పందించి మారుతి జాదవ్ను నాగల్గిద్ద కాంప్లెక్స్ హెచ్‌ఎంగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు.

దీంతో కొంతకాలంగా కొనసాగుతున్న కాంప్లెక్స్ పర్యవేక్షణ సమస్యకు పరిష్కారం లభించింది. బాధ్యతలు చేపట్టిన మారుతి జాదవ్ మాట్లాడుతూ కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలలను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ విద్యా ప్రమాణాల మెరుగుదలకు, విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు