ముత్తంగిలో రూ.1.70 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
13-11-2026 | 02:31pm
పటాన్ చెరు, నవంబర్ 13: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలోని(Patancheru Constituency) ముత్తంగి డివిజన్ పరిధిలోని మధురానగర్, గాయత్రి కాలనీలలో రూ.1.70 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal Reddy) శంకుస్థాపన చేశారు. డివిజన్‌లోని ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. అనంతరం ఛట్ పూజ సందర్భంగా ఉత్తర భారతీయులకు తన సొంత నిధులతో కొనుగోలు చేసిన చెరుకును పంపిణీ చేశారు.