డిసెంబర్‌లో చక్కెర ఫ్యాక్టరీ ప్రారంభం?

08-10-2026 | 05:15am
  1. జోరందుకున్న పనులు
  2. తీరనున్న అన్నదాతల కష్టాలు

జహీరాబాద్, అక్టోబర్ 7 : జహీరాబాద్ ప్రాంతంలోని(Zaheerabad region) కొత్తూరు బి వద్దగల ఓంకార్ చక్కెర కర్మాగారం(Omkar Sugar Factory) ఎట్టకేలకు ప్రారంభం కానుంది. ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో గానుగాడించేందుకు చక్కెర ఫ్యాక్టరీ యాజమాన్యం(Sugar factory management) ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ ప్రాంతంలో అధికంగా చెరుకు పండిస్తున్న రైతులు(Farmers) దిగులు చెందవలసిన అవసరం లేదని, ప్రతిరోజు 3,500 టన్నుల చెరుకును(Sugarcane) గానుగ ఆడించేందుకు ఓంకార్ ఫ్యాక్టరీ యాజమాన్యం చర్యలు తీసుకుంటుంది.

గతంలో చక్కెర కర్మాగారము నిజాం చెక్కర ఫ్యాక్టరీగా(Nizam Sugar Factory) ఉండేది. తదనంతరం ఈ కంపెనీ ట్రైడెంట్ చెక్కెర కర్మాగారంగా మారింది. ట్రైడెండ్ చక్కెర కర్మాగారం యాజమాన్యం సక్రమంగా ఈ ఫ్యాక్టరీని నడిపించకపోవడంతో పాటు రైతులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో యాజమాన్యం మొండివైఖరి అవలంబించింది.

దీంతో ఈ చక్కెర కర్మాగారం మూతపడడంతో రైతులు తమ చెరుకును ఇతర ప్రాంతాలకు తరలించవలసిన అవసరం ఏర్పడింది. ప్రస్తుత కాలంలో ట్రైడెంట్ కంపెనీని ఓంకార్ కంపెనీ కొనుగోలు చేసి చెరుకు గానుగ ఆడించేందుకు గాను ఫిబ్రవరి నెలలో ఫ్యాక్టరీని ట్రయల్ రన్ కూడా చేశారు. దీనిలో కొన్ని లోటుపాట్లను ఉన్నందున వాటిని కూడా సరి చేశారు. 

తప్పిదాలు జరగకుండా చూస్తాం...

ఓంకార్ చెక్కెర కర్మాగారంలో గతంలో జరిగినట్లు ఈసారి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తగా ఫ్యాక్టరీని నడిపేందుకు ప్రయత్నిస్తామని జనరల్ మేనేజర్ రఘునందన్ రెడ్డి తెలిపారు. ఈ సంవత్సరం ప్రతిరోజు 3500 టన్నుల   చెరుకును గానుగ ఆడించేందుకు సన్నహాలు చేస్తున్నామన్నారు. 1047 టన్నుల చెరుకును గానుగ ఆడించి రాయల్ ఎన్ చేశామని ఆయన తెలిపారు దీనికిగాను రైతులకు రూ.3450 టన్నుకు చెల్లించడం జరిగిందని తెలిపారు. ఈ సీజన్లో ఇంకా ధర నిర్ణయించలేదని, యాజమాన్యం నిర్ణయం మేరకు ధర నిర్ణయించి రైతుల వద్ద చెరుకు కొనుగోలు చేస్తామన్నారు. రైతులకు కూలీల రవాణా ఖర్చులు యాజమాన్యమే చూసుకుంటుందని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు