పల్లె ముఖం చూడని పల్లె వెలుగు

28-10-2026 | 05:05am
  1. సాయంత్రమైతే ఆటోలే దిక్కు
  2. రవాణా సౌకర్యం లేక జహీరాబాద్ నియోజకవర్గ ప్రజల ఇబ్బందులు
  3. కరోనా కాలం నాటి రద్దులే నేటికీ శాపాలు
  4. పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు

జహీరాబాద్, అక్టోబరు 26: గ్రామీణ ప్రాంత ప్రజల రవాణా ఇబ్బందులను తీర్చి, వారికి సుఖవంతమైన ప్రయాణాన్ని అందించాలనే ఆశయంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(Telangana State Road Transport Corporation) (TGSRTC) ’పల్లె వెలుగు’ బస్సులను ప్రవేశపెట్టింది. కానీ ఆ బస్సులు ఇప్పుడు పల్లెల ముఖం చూడటమే మానేశాయి. జహీరాబాద్ బస్సు డిపో(Zaheerabad Bus Depot) పరిధిలో ప్రజా సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన బస్సులు పల్లె ప్రజలకు మాత్రం అందుబాటులో లేకుండా పోయాయి. స్వాతంత్య్రం(Independence) వచ్చి ఏడు దశాబ్దాలు దాటుతున్నా, పల్లెలకు సరైన రవాణా సౌకర్యం కల్పించడంలో ఇటు ప్రజాప్రతినిధులు, అటు అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

60 శాతం గ్రామాల్లో నిలిచిన బస్సులు...

జహీరాబాద్ నియోజకవర్గంలోని(Zahirabad Constituency) దాదాపు 60 శాతం గ్రామాలకు ప్రస్తుతం బస్సు సౌకర్యం లేదు. 1932లో నిజాం కాలంలో ప్రారంభమై, అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చిన రవాణా సంస్థ(Transport organization) ఆశయం ఇక్కడ నెరవేరడం లేదు. జహీరాబాద్ డిపో నుంచి ప్రతిరోజూ ఇతర సుదూర ప్రాంతాలకు బస్సులు నడుపుతున్నప్పటికీ, స్థానిక పల్లెటూళ్లను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు.

కరోనా నాటి కోత.. నేటికీ అంతే

గతంలో కరోనా మహమ్మారి రాకముందు రాత్రి 9 గంటల వరకు పల్లెలకు బస్సు సౌకర్యం ఉండేది. కానీ లాక్డౌన్ సమయంలో నిలిపివేసిన బస్సులను, సాధారణ పరిస్థితులు వచ్చాక కూడా పల్లెలకు పునరుద్ధరించలేదు. వాటిని ఇతర లాభసాటి మార్గాలకు మళ్లించారు. సాయంత్రం 5 గంటలు దాటిందంటే పల్లెలకు ఒక్క బస్సు కూడా దొరకని పరిస్థితి నెలకొంది.

మాయమైన సర్వీసులు.. ఇబ్బందుల్లో 30 గ్రామాలు..

గతంలో జహీరాబాద్ డిపో నుండి ఆందోల్ నియోజకవర్గం, రాయికోడ్ మండలంలోని హస్నాబాద్, సింగీతం, పీపడపల్లి రూట్లలో బస్సులు నడిచేవి. కరోనా తర్వాత ఈ సర్వీసులను పూర్తిగా రద్దు చేయడంతో ఆయా రూట్లలోని దాదాపు 25 నుండి 30 గ్రామాలకు రవాణా బంద్ అయింది. దీనికితోడు గతంలో నిజామాబాద్ వెళ్లే బస్సుల ను ఇప్పుడు ’ఎక్స్ప్రెస్’లుగా మార్చా రు. ఫలితంగా జరాసంగం మండలంలోని కృష్ణాపూ ర్, మార్చినూర్, కుప్పానగర్, సంఘం కె, తుమ్మనపల్లి వంటి గ్రామాల వద్ద ఈ బస్సులు ఆగడం లేదు. దీంతో విద్యార్థులు, వ్యాపారులు, నిరుపేద ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ప్రైవేటు వాహనాల దోపిడీ..

సాయంత్రం వేళల్లో బస్సులు లేకపోవడంతో ప్రయాణికులకు ఆటోలు, ప్రైవేటు వాహనాలే దిక్కవుతున్నాయి. చీకటి పడితే చాలు ప్రైవేటు వాహనదారులు, ఆటోల వారు ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని అడ్డగోలుగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. విధిలేక సామాన్య ప్రజలు అధిక డబ్బులు వెచ్చించి తమ గ్రామాలకు చేరుకోవాల్సి వస్తోంది. కరోనా కంటే ము ందు నడిచిన పల్లె వెలుగు బస్సులను య థావిధిగా నడిపితే తమ రవాణా కష్టాలు తీ రుతాయని గ్రామీణ ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి, జహీరాబాద్ డిపో నుండి గ్రామీణ ప్రాంతాలకు తక్షణమే బస్సులను పునరుద్ధరించాలని ప్రజలు బహిరం గంగా డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు