పీహెచ్సీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
నంగునూరు, అక్టోబర్ 15 (విజయక్రాంతి):నంగునూరు మండల పరిధిలోని రాజగోపాలపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(Primary Health Centre) ఆధ్వర్యంలో గురువారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.తెలంగాణ సాంస్కృతిక(Telangana Culture) ప్రతీక అయిన బతుకమ్మ పండుగను వైద్య సిబ్బంది ఉత్సాహంగా,ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
ఈ వేడుకల్లో భాగంగా ఆసుపత్రి ప్రాంగణంలో అందమైన బతుకమ్మలను తీర్చిదిద్ది, చుట్టూ చేరి కోలాటాలతో, బతుకమ్మ పాటలతో సందడి చేశారు.వైద్య సిబ్బంది అందరూ సాంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని పండుగ శోభను ఇనుమడింపజేశారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ ఉదయ్ కుమార్,కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్ఓ) భాస్కర్ శివయ్య, హెల్త్ ఎడ్యుకేటర్ ఆఫీసర్ (హెచ్ఈఓ) స్వామి, ఏఎన్ఎంలు,సహాయకులు,ఆశా కార్యకర్తలు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.